E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో లాభాలు – నిరుద్యోగులకు విజయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో లాభాలు – నిరుద్యోగులకు విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 25వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వాహన సంభందిత  వ్యాపారాలు లాభాలుబాట పడతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.   ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృషభం

Advertisement

 బంధు  మిత్రులతో  అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది.  ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. 

మిథునం

మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు విస్తరణకు నూతన  అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి  సహాయ సహకారాలు అందుతాయి.  ప్రయాణాలలో  అప్రమత్తంగా వ్యవహరించాలి.

కర్కాటకం

Advertisement

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో  పై చేయి సాధిస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు  ఉపయోగపడతాయి. సంతానం  పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.  ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహం

గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో  సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. 

కన్య

వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.  వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. సోదరులతో ఆస్తి  వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు  వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం

దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు.  చేపట్టిన పనులు  సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగమున విధులు  సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. 

ధనుస్సు

వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.  ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  

మకరం

చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  

కుంభం

గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.  సన్నిహితులతో  వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా  సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం

 వృత్తి వ్యాపారాలు  మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.  కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన  నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×