E-Paper
Advertisement

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో
Advertisement

Korean Thriller: ఓటీటీలో ప్రతిరోజూ ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని కథలు మాత్రం ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లా కాకుండా, మనిషి జ్ఞాపకాలతోనే ప్రమాదకరమైన ఆట ఆడతాయేమో అనిపించేలా ఉంటాయి. అలాంటి అరుదైన కొరియన్ థ్రిల్లరే ‘రీసెట్’ (Reset). పేరు వినగానే టైమ్ ట్రావెల్ కథ అనిపించొచ్చు. కానీ ఇది పూర్తిగా మెమరీ లాస్, సీరియల్ కిల్లర్ కు సంబంధించిన మిస్టరీ డ్రామా. మరి ఈ మిస్టరీ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? ఇంతకీ సిరీస్ కథ ఏంటి ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో మన హీరో పేరు చా వూ-జిన్. అతను తెలివైన పబ్లిక్ ప్రాసిక్యూటర్. నేరస్థులను శిక్షించడంలో అతనికి మంచి పేరుంది. కానీ అతన్ని ఓ గాయం మాత్రం వదలకుండా వెంటాడుతూనే ఉంటుంది. 15 ఏళ్ల క్రితం అతని ఫస్ట్ లవ్ సీంగ్-హీ దారుణంగా హత్యకు గురవుతుంది. ఆ సంఘటనను స్వయంగా చూసిన వూ-జిన్ తీవ్రంగా మెంటల్ షాక్ కు గురై తన జ్ఞాపకాలలో కొంత భాగాన్ని కోల్పోతాడు. అప్పటి నుంచి అతనికి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం… ఆ హంతకుడిని పట్టుకోవడం.

Advertisement

ఆ పాత హత్య కేసుకు సంబంధించిన చట్టపరమైన గడువు ముగియడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ లోపు హంతకుడు దొరకకపోతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో వూ-జిన్ దర్యాప్తును మరింత వేగవంతం చేస్తాడు. అదే సమయంలో అతని జీవితంలోకి జో ఉన్-బి అనే హైస్కూల్ విద్యార్థిని వస్తుంది.

ఆమెను చూసిన క్షణమే వూ-జిన్ షాక్‌కు గురవుతాడు. ఎందుకంటే ఆమె రూపం… అచ్చం 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన ప్రేమికురాలిని పోలి ఉంటుంది. కానీ ఆమె హంతకురాలు కాదని హీరోకి అర్థం అవుతుంది. అంతలోనే జో ఉన్-బి అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కోవడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో వూ-జిన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తాయి.

Advertisement

ఆ సైకో కిల్లర్ తనను ‘ఎక్స్’గా పరిచయం చేసుకుంటాడు. వూ-జిన్ మరిచిపోయిన గతాన్ని మళ్లీ గుర్తు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు ఎవరు నిజం చెబుతున్నారు ? ఎవరు అబద్ధం ఆడుతున్నారు ? అనే సందేహాలు ప్రేక్షకుడిని చివరి వరకు వదలవు. ఇంతకీ చివరికి ఏమైంది? అసలు జో ఉన్-బి ఎవరు ? 15 ఏళ్ల క్రితం జరిగిన హత్య వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి ? ‘ఎక్స్’ అనే మిస్టరీ కిల్లర్ ఎవరు ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ను తప్పకుండా చూడాల్సిందే.

తెలుగులో ఉందా లేదా ?

‘రీసెట్’ సిరీస్ లో చున్ జంగ్-మ్యూంగ్, కిమ్ సో-హ్యూన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు కిమ్ యాంగ్-క్యున్ కథను నెమ్మదిగా నడిపిస్తూనే, ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త ట్విస్ట్‌ను ప్లాన్ చేసి, ఆడియన్స్ చేత వర్త్ వాచింగ్ మావా అనిపించారు. 2014లో వచ్చిన ఈ కొరియన్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్లుగా ఉంటుంది. Rakuten Vikiలో స్ట్రీమింగ్ అవుతుండగా, తెలుగులో అవైలబుల్ గా లేదు. సిరీస్ ను ఒకసారి మొదలుపెడితే పూర్తయ్యే వరకు ఆపడం కష్టమే.

Read Also: బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Related News

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్

దురదృష్టవంతుడి చేతిలో విశ్వవినాశనాన్ని ఆపే బాధ్యత… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×