E-Paper
Advertisement

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్ ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!

TG Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌ హిట్.. రేవంత్  ప్లాన్ అదుర్స్.. పెట్టుబడుల సునామీ!
Advertisement

కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో.. రేవంత్ సర్కార్ అదే చేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవిష్యత్‌ని నిర్ణయించబోయే.. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజుల్లో.. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీల దగ్గర్నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయ్. అయితే.. ఏయే రంగాల్లో ఎన్నెన్ని పెట్టుబడులొచ్చాయి? ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లతో.. ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయ్?

కంపెనీల నుంచి లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఊహించని స్థాయిలో పెట్టుబడుల వెల్లువ కనిపించింది. ఆర్థిక సదస్సు మొదలైన తొలి రోజే.. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.. కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రెండోరోజు కూడా అదే జోష్ కనిపించింది. 3 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. సుమారుగా 6 లక్షల కోట్ల పెట్టుబుడులు రాష్ట్రానికి వచ్చాయి. ఒక్క పవర్ సెక్టార్‌లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ్. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగాల్లో భారీ ప్రాజెక్టులు వచ్చాయ్. అజయ్ దేవగణ్ ఫిల్మ్ స్టూడియోలో.. స్టూడియోలు, వీఎఫ్ఎక్స్, వర్క్ షాప్‌ల లాంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్‌ను.. పీపీపీ మోడల్‌లో డెవలప్ చేయనున్నారు. దీంతో.. యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి.. ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. తెలంగాణని గ్లోబల్ హకీ హబ్‌గా మార్చేందుకు.. హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2026ని.. 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ 2026ని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలో.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్.. ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం కానుంది.

సింగపూర్‌కి ఆదర్శంగా తెలంగాణ

Advertisement

ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు చూశాక అందరికీ ఒకటే అనిపించింది.. తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్‌ అని! ఈ జర్నీలో.. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వం, మార్కెట్ ఎక్స్‌పర్ట్స్, పాలసీ మేకర్స్, కార్పొరేట్లు భాగస్వాములై ఉంటారు. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్‌ని ఆదర్శంగా తీసుకుని.. ఆ దేశాలతో పోటీపడేందుకు తెలంగాణ సిద్ధమైంది. 2047 తెలంగాణ రైజింగ్‌ ప్రయాణంలో భాగంగా.. ఆ దేశాల పెట్టుబడులు, సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించారు. రాష్ట్రం ఏర్పడిన పదేళఅల తర్వాత.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతంగా మారేందుకు.. ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణలో పెట్టుబడుల సునామీ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో.. పెట్టుబడుల సునామీ వచ్చింది. ఈ సమ్మిట్.. రాష్ట్ర ఆర్థిక చరిత్రలో ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది. రాష్ట్ర భవిష్యత్తుని సరికొత్త దిశకు తీసుకెళ్లేలా, అంచనాలకు మించి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు.. కీలక రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయ్. రెండు రోజుల సమ్మిట్‌లో ఆకర్షించిన మొత్తం పెట్టుబడుల విలువ సుమారు 5 లక్షల కోట్లకు పైనే ఉన్నాయ్. ఇండియాలో మరే రాష్ట్రం సాధించని విధంగా.. ఒకే రోజులో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించడం.. రికార్డుగా నిలిచింది. ఈ పెట్టుబడులన్నీ.. తెలంగాణ రైజింగ్-2047 విజన్ సాధనలో.. కీలకపాత్ర పోషించనున్నాయ్. గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులు.. ప్రధానంగా రాష్ట్రం ఫోకస్ చేసిన.. డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, విద్యుత్, కోర్ ఇన్‌ఫ్రా లాంటి భవిష్యత్ రంగాలమీదే ఉన్నాయ్. ఈ భారీ పెట్టుబడుల ద్వారా.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయ్. లక్షల కోట్ల పెట్టుబడులు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా.. లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తాయనే అంచనాలున్నాయ్. ఈ పెట్టుబడులు కేవలం.. సంఖ్యలకే పరిమితం కాకుండా.. డీప్ టెక్, ఏరోస్పేస్ లాంటి హై స్కిల్డ్ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించి.. రాష్ట్ర యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది.

ఇన్వెస్టర్లను ఆకర్షించిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

Advertisement

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. పరిశ్రమలకు అందిస్తున్న మద్దతు, సుస్థిర విధానాలపై.. పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించింది. ఇది కేవలం.. పెట్టుబడుల సదస్సు మాత్రమే కాదు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు కీలక మైల్ స్టోన్. ఈ పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి, ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు.. ముఖ్యంగా ఉద్యోగాల సృష్టికి బలమైన పునాదులు వేయనున్నాయ్. తెలంగాణ భవిష్యత్‌కి భరోసాగా నిలవనున్నాయ్.

తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలేంటి?

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి రీజనేంటి? ఈ ఆర్థిక సదస్సును ఇంత విజయవంతం చేసేందుకు.. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలేంటి? కంపెనీలన్నీ తెలంగాణే.. పెట్టుబడులకు బెస్ట్ డెస్టినేషన్ అని ఎందుకు ఆలోచిస్తున్నాయ్? నగర శివార్లలో రూపుదిద్దుకోనున్న ప్యూచర్ సిటీతో.. హైదరాబాద్ లెక్కే మారిపోతుందా? ఇంకొన్నేళ్లలో.. తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీని టచ్ చేయడం ఖాయమా?

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. కేవలం.. ఓ ఆర్థిక సదస్సుగా కాకుండా, భవిష్యత్ తెలంగాణకు ఒక రోడ్ మ్యాప్‌ని, భరోసాని ఇచ్చింది. ఈ సమ్మిట్.. ఇంతటి గ్రాండ్ సక్సెస్ అవడానికి, ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు.. తెలంగాణ వైపు అట్రాక్ట్ అవడానికి.. రేవంత్ సర్కార్ అనుసరించిన విధానాలే కారణం. రానున్న రోజుల్లో.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.. ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే నమ్మకాన్ని ఇచ్చాయ్.. ఇప్పుడొచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు. ఈ గ్లోబల్ సమ్మిట్ సౌండ్.. గ్లోబ్ వైడ్ వినిపించడానికి.. సీఎం రేవంత్ ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ కూడా మరో కారణం. తెలంగాణ ప్రభుత్వం కేవలం పెట్టుబడుల సదస్సుగా కాకుండా, సమగ్ర అభివృద్ధి, లాంగ్ టర్మ్ విజన్ వేదికగా.. ఈ సమ్మిట్‌ని తీర్చిదిద్దింది. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగడం మొదటి టార్గెట్ అయితే.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని ప్రకటించారు. ఇది.. కల మాత్రమే కాదు. గమ్యాన్ని ముద్దాడేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ని ఆవిష్కరించారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లాంటి వేగవంతమైన ఆర్థికాభివృద్ధి మోడల్స్‌ని రీసెర్చ్ చేసి.. వాటిని తెలంగాణలో అమలు చేయాలనే విధానాన్ని.. గ్లోబల్ సమ్మిట్ వేదికపై ప్రకటించడం.. అంతర్జాతీయ కంపెనీల్లోనూ, పెట్టుబడిదారుల్లోనూ.. గొప్ప నమ్మకాన్ని పెంచింది.

గ్లోబల్ సమ్మిట్ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి రీజనేంటి?

ఈ సమ్మిట్ ఇంతలా సక్సెస్ కావడానికి మరో కారణముంది. అదే.. త్రీ జోన్ గ్రోత్ స్ట్రాటజీ. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి కోసం, ఆర్థిక వ్యవస్థను మూడు ప్రత్యేక జోన్‌లుగా విభజించారు. ఇది.. పెట్టుబడిదారులకు వారి పరిశ్రమకు తగిన ప్రాంతాన్ని ఎంచుకునే స్పష్టతనిస్తుంది. క్యూర్ జోన్‌లో.. హైదరాబాద్‌ కేంద్రంగా.. హై-ఎండ్ సర్వీసెస్, టెక్నాలజీ, అర్బన్ ఇన్నోవేషన్ రంగాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్యూర్ జోన్‌లో.. నగర శివారు ప్రాంతాల్లో మ్యానుఫాక్చరింగ్, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. రేర్ జోన్‌లో.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత, అగ్రి ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి చేపట్టనున్నారు. సమగ్ర తెలంగాణ అభివృద్ధి కోసం.. వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని సర్వీసెస్, ప్రొడక్షన్, అగ్రికల్చర్ పేరిట.. 3 జోన్లుగా విభజించింది ప్రభుత్వం. ఇదే.. ఇన్వెస్టర్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఇంతటి స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా మార్చింది. ఇప్పటికే.. దేశ జనాభాలో దాదాపు 3 శాతం ఉన్న తెలంగాణ.. నేషనల్ జీడీపీలో 5 శాతం సమకూరుస్తోంది. 2047 నాటికి.. ఈ మొత్తాన్ని 10 శాతానికి పెంచడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు.

2047 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధం

తెలంగాణలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న దానిపై కంపెనీలకు కూడా మంచి అవగాహన ఉంది. 2047 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు.. ప్రభుత్వం, అధికారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు.. టెక్నాలజీ, సుస్థిరతపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టారు. దానిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ లక్షల కోట్ల పెట్టుబడులు.. ఉద్యోగాల సాధనలో, ప్రపంచస్థాయి మౌలిక వసతుల్లో.. దేశ ఆర్థిక ప్రయాణానికి.. తెలంగాణ నాయకత్వం వహించేందుకు మద్దతుగా నిలవనున్నాయి. ఇది మాత్రమే కాదు.. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలన, పారదర్శకమైన పాలన, వేగవంతమైన నిర్ణయాల లాంటివి.. కంపెనీలకు అనుమతులివ్వడంలో.. ఈజ్ ఆఫ్ డూయింగ్ లాంటి అంశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. భవిష్యత్ కోసం వేచి చూడట్లేదు.. మా భవిష్యత్‌ని మేమే చురుగ్గా నిర్మిస్తున్నాం అనే ప్రభుత్వ విధానం.. అనేక కంపెనీల్లో భరోసా నింపింది. గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజే.. రెండున్నర లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు కుదరడం.. ఈ సదస్సు సక్సెస్ అయిందనడానికి గ్రేట్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా.. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్, బ్రూక్‌ఫీల్డ్-యాక్సిస్ వెంచర్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు.. కీలక రంగాల్లో భారీగా పెట్టుబడుల్ని ప్రకటించాయ్.

అంతర్జాతీయ, దేశీయ కంపెనీల దృష్టిలో హైదరాబాద్

అంతర్జాతీయ, దేశీయ కంపెనీల దృష్టిలో.. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా నిలబడటానికి.. అనేక బలమైన కారణాలున్నాయ్. నైపుణ్యం కలిగిన యువత, ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యలో ముందుండటం, హై క్వాలిటీ మానవ వనరులు ఉండటం.. కంపెనీలకు సానుకూలమైన అంశంగా కనిపించింది. వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా దిగ్గజ సంస్థలను ఆకర్షించింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా ఉన్న మెరుగైన కనెక్టివిటీదే.. ఈ పెట్టుబడుల్లో కీలక పాత్ర పోషించాయ్. ఇప్పటికే.. హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాల్లో బలంగా స్థిరపడింది. ఇటీవలికాలంలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులొచ్చాయ్. తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి రేటు.. జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం, తలసరి ఆదాయం.. జాతీయ సగటు కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉండటం కూడా.. కంపెనీలని అట్రాక్ట్ చేసింది. నగర శివార్లలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్.. హైదరాబాద్ భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే టూల్‌గా కనిపిస్తోంది. ఇది.. గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డీప్ టెక్, ఏఐ, హై వాల్యూ సర్వీసెస్ కోసం.. ఓ నెట్ జీరో అర్బన్ ఎకో సిస్టమ్‌గా రూపాంతరం చెందనుంది.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి భారీ పెట్టుబడులు

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం.. దిగ్గజ సంస్థలెన్నో భారీ పెట్టుబడులను ప్రకటించాయ్. దీని ద్వారా.. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయ్. దాంతో.. స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ ఖ్యాతి.. గ్లోబల్ ఇన్నోవేషన్ మ్యాప్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో వచ్చిన భారీ పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు ఇంధనంగా పనిచేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన లక్ష్యాలు, విధానపరమైన స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైదరాబాద్‌కు గ్లోబల్ హబ్‌గా ఉన్న గుర్తింపు కారణంగా.. అతి త్వరలో ట్రిలియన్ డాలర్ ఎకానమీని టార్గెట్‌ని ఛేదించి.. భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×