E-Paper
Advertisement

OTT Movie : మనుషుల రక్తం తాగే వాంపైర్ దెయ్యం … గుండెల్లో గుబులు పుట్టించే సీన్స్… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : మనుషుల రక్తం తాగే వాంపైర్ దెయ్యం … గుండెల్లో గుబులు పుట్టించే సీన్స్… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

OTT Movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో హారర్ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు మూవీ లవర్స్. అందుకు తగ్గట్టే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త స్టోరీలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఇండోనేషియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా హారర్ సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో కుంతిలానక్  అనే ఒక దయ్యం మనుషుల రక్తాన్ని రుచి మరుగుతుంది. ఈ సినిమా చివరి వరకు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

స్టోరీలోకి వెళితే

Advertisement

మొదటి పార్ట్ లో డిండా  అనే అమ్మాయి కుంటిలానక్ అనే దెయ్యం నుండి తప్పించుకుంటుంది. ఈ పార్ట్ లో ఆత్మతో ప్రెగ్నెన్సీ కోసం ఒక ఒప్పందం కూడా జరుగుతుంది.  ప్రస్తుతం డిండా  తన అత్త డోన్నా ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. ఇప్పుడు తను వుండే ఇంటికి కర్మిలా అనే మహిళ వస్తుంది. తాను డిండా తల్లి అని చెప్పి ఒక చోటుకి డిండాను పంపమని డోన్నాకి చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చింది తన తల్లి అనుకుని, ఆమెను కలవడానికి తన తోబుట్టువులు జూలియా, ఎడ్విన్‌లను తీసుకుని ఒక అడవిలో ఉన్న ఇంటికి వెళ్తుంది డిండా . అయితే ఈ ఇంటికి సమీపంలో ఎవరూ ఉండరు. ఈ ఇంట్లోకి వచ్చిన తరువాత వీళ్లందరూ చిక్కుల్లో పడతారు. ఇక్కడ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి.

వీటి వల్ల అక్కడికి వచ్చిన వీళ్ళంతా భయపడిపోతారు.  ఈ ఇల్లు ఒక అతీంద్రీయశక్తులతో నిండి ఉంటుంది. ఇక్కడకి వచ్చిన వీళ్ళని కుంటిలానక్ అనే దెయ్యం భయాంకరంగా వెంటాడుతుంది. ఈ సారి డిండా గతంలో మాదిరిగా తనకి వచ్చిన మంత్రాలతో కుంటిలానక్ దెయ్యాన్ని ఓడించలేకపోతుంది. ఎందుకంటే ఈ కుంటిలానక్ ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. రక్తాన్ని కూడా రుచిమరుగుతుంది.  చివరికి ఈ కుంటిలానక్ దెయ్యం ఎవరు ? డిండా  కోసం ఎందుకు వచ్చింది ? గతంలో డిండా  ఎదుర్కున్న సంఘటనలు ఏమిటి ? ఇంతకీ దెయ్యంతో జరిగిన ఒప్పందం ఏమిటి ?  అనే  విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్

జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘కుంటిలానక్ 2’ ( Kuntilanak 2). 2019 లో వచ్చిన ఈ సినిమాకి రిజాల్ మంతోవానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2018 లో వచ్చిన కుంటిలానక్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది.  ఈ సినిమా స్టోరీ డిండా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ ఇండోనేషియన్ సినిమా తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×