BigTV English

OTT Movie : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్

OTT Movie : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో ఇప్పుడు మలయాళం సినిమాలకి క్రేజ్ బాగా పెరిగింది. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చివరివరకూ ట్విస్టులతో  ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

సారా (మమతా మోహన్‌దాస్) అనే మలయాళీ యువతి బెంగళూరులో నర్సుగా పని చేస్తూ ఉంటుంది. ఆమె భర్త టామ్ (శిజోయ్ వర్ఘీస్) తో కలసి జీవిస్తూ ఉంటుంది. ఒక రోజు ఈ దంపతులు తమ కూతురు పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో పార్టీ తర్వాత టామ్ ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతాడు. దీనివల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళి అతను మరణిస్తాడు. సారా కంప్లైంట్ చేయడంతో పోలీసు అధికారి డిసిపి గణేష్ హెగ్డే (రాహుల్ దేవ్ శెట్టి) విచారణ ప్రారంభిస్తాడు. ఇది హత్యా, ఆత్మహత్యా లేదా సహజ మరణమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. ఈ దర్యాప్తులో భాగంగా పుట్టిన రోజుకి హాజరైన ఏడుగురితో పాటు సారాని కూడా ప్రశ్నిస్తారు. పోస్ట్ మార్టం లో విష ప్రయోగం జరిగినట్టు తేలుతుంది. దీంతో ఇది సహజ మరణం కాదని ఒక క్లారిటీకి వస్తారు పోలీసులు.


ఈ విష ప్రయోగం హత్యా, ఆత్మ హత్యా అన్న కోణం లో విచారణ చేస్తాడు డిసిపి గణేష్ హెగ్డే. విచారణలో దిమ్మ తిరిగే విషయాలు బయటికి వస్తాయి. ప్రధాన అనుమానితుల్లో టామ్ స్నేహితులు, సహోద్యోగులతో బాటు భార్య సారా కూడా వుంటుంది. సారా రాసుకున్న డైరీలో టామ్ తో అంత మంచి సంబంధాలు లేవని తెలుస్తుంది. డిసిపి హెగ్డే విచార కొనసాగిస్తూ పోతూంటే చివరికి దోషి ఎవరో తెలుసుకుని షాక్ అవుతాడు. చివరికి టామ్ ని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? డిసిపి గణేష్ హెగ్డే వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఫోన్ లో అసభ్యంగా వేధించే సైకో గ్యాంగ్ … ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే ఫ్యూజులు అవుట్

 

జీ 5 (Zee 5) లో

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లాల్‌బాగ్’ (Lalbagh). 2021 లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రశాంత్ మురళీ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. ఇందులో మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలో నటించింది. నేహా సక్సేనా, రాహుల్ మాధవ్, రాహుల్ దేవ్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా స్టోరీ బెంగళూరు నగరంలో ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. ఈ మూవీ జీ 5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×