BigTV English

Operation Sindoor: భారత భీకర దాడి.. బాంబుల మోత ఎలా మోగిందంటే..?

Operation Sindoor: భారత భీకర దాడి.. బాంబుల మోత ఎలా మోగిందంటే..?

పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పేందుకు ఈనెల 7న భారత సైన్యం ఆపరేష్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆపరేష్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని భారత్ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామని, ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని ప్రకటించింది. అయితే అందుకు సంబంధించిన వీడియోలేవీ అప్పట్లో విడుదల చేయలేదు. కేవలం సమాచారం మాత్రం ఇచ్చింది. ఆ తర్వాత యుద్ధం మొదలవడంతో.. పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలను కూడా భారత్ టార్గెట్ చేయాల్సి వచ్చింది. తాజాగా ఆ భీకర దాడికి సంబంధించిన వీడియోలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) విడుదల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సైనికుల ధైర్య సాహసాలు ఈ వీడియోలో కనపడుతున్నాయి. శత్రు మూకలను తుదముట్టించేందుకు భారత సైన్యం చూపించిన సాహస పరాక్రమాలకు ఈ వీడియోల్లో చోటు దక్కింది.


తోకముడిచిన పాక్..
పుట్వాల్, చాప్రార్, చోటా చక్‌లోని పాకిస్తాన్ పోస్టులపై భారత్ దాడి చేసిన దృశ్యాలతో కూడిన వీడియోలను ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు విడుదల చేసింది. భారత మిలట్రీ, వైమానిక దళాల సమన్వయంతో ఈ దాడులు జరిగాయి. పాక్ స్థావరాలపై భారత్ దాడి చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది..? దాడి తీవ్రత ఎలా ఉంది..? అనే అంశాలు ఈ వీడియోలో పూర్తి స్థాయిలో బహిర్గతం అయ్యాయి. భారత్ దాడుల్ని పాక్ ఏమాత్రం తిప్పికొట్టలేకపోయిందనే విషయం కూడా ఈ వీడియోలతో స్పష్టమైంది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ కి గణనీయమైన నష్టం జరిగింది. అదే సమయంలో శత్రుదళాలు వెనక్కి తగ్గాయి. పాకిస్తాన్ తోకముడిచినట్టు వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది.

భారత్ వ్యూహాత్మక విజయం..
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మొదట ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసిన భారత్, ఆ తర్వాత సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరాలపై కూడా బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొంది. మన సైనిక బలం మరోసారి ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది. శత్రుదేశ మిసైల్స్ ని ఆకాశంలోనే ధ్వంసం చేసింది భారత్ కి చెందిన రక్షణ వ్యవస్థ. పాకిస్తాన్ వద్ద కూడా చైనా తయారీ రక్షణ వ్యవస్థ ఉన్నా కూడా అది ఇంత సమర్థంగా పనిచేయలేదు. దీంతో పాకిస్తాన్ లోని లక్ష్యాలను భారత్ సులభంగా ఛేదించగలిగింది.


ప్రస్తుతం బారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. యుద్ధం ఆగిపోయిన తర్వాత భారత విజయాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. భారత్ దాడుల్ని పాక్ తట్టుకోలేకపోయిందనే విషయాన్ని ఆ దేశ అధికారులు కూడా అంగీకరించారు. పాకిస్తాన్ నుంచి తెప్పించిన ఆయుధాలు, రక్షణ వ్యవస్థ సామర్థ్యాలు ప్రశ్నార్థకం కావడంతో పాక్ సైన్యం ఆలోచనలో పడింది. వ్యూహాత్మక విజయంతో భారత్ మరింత ధీమాగా ముందుకెళ్తోంది. కవ్వింపు చర్యలకు దిగితే పాక్ కి గట్టిగా బుద్ధు చెబుతామని హెచ్చరించింది. అటు సింధూ జలాల విషయంలో కూడా భారత్ ససేమిరా అంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతిచ్చినంత కాలం సింధూ జలాల విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెబుతున్నారు అధికారులు.

Tags

Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×