E-Paper
Advertisement

Medchal Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే లారీ డ్రైవర్ మృతి

Medchal Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే లారీ డ్రైవర్ మృతి
Advertisement

Medchal Crime: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేేసుకుంది. బాహ్య వలయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్, కారు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరాబాద్ వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన

చర్లపల్లి నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ ఒకటి శనివారం సాయంత్రం బయలుదేరింది. రింగ్ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ మునిరాబాద్ ప్రాంతం చేరుకుంది. అదే దారిలో వెళ్తున్న ఒక కారును ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందపడింది. ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ రామరాజు (45) ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

ప్రమాదంలో ఢీకొన్న కారు ఉప్పల్ ప్రాంతానికి చెందిన నాగేంద్ర (29) నడుపుతున్నాడు. నాగేంద్ర ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. కారుకు పూజ చేయించుకునేందుకు రింగ్ రోడ్డు మీదుగా ఏడుపాయలకు బయలుదేరాడు. నాగేంద్రతో పాటు మరో నలుగురు బంధువులు కారులో ప్రయాణిస్తున్నారు. ట్యాంకర్ ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ALSO READ: Hyderabad News: తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×