E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్  

Nindu Noorella Saavasam Serial Today Episode April 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బయటకు వెళ్లిన రణవీర్‌ కాటేజ్‌ దగ్గరకు రావడం అమర్‌, లాల్‌సింగ్‌ చూస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం అమర్‌ అని లాల్‌సింగ్‌ అడగ్గానే.. రణవీర్‌ వైఫ్‌ వచ్చే వరకు ఇక్కడే వెయిట్‌ చేద్దాం అంటాడు అమర్‌. దీంతో ఇద్దరు వెయిట్‌ చేస్తుంటే.. సెక్యూరిటీ అతను వచ్చి మీ కాటేజ్‌ కీస్‌ సార్‌ అని ఇస్తాడు. అమర్‌ ఆశ్చర్యంగా మా కాటేజ్‌ కీస్‌ నీ దగ్గర ఎందుకున్నాయి. అని అడగ్గానే.. సెక్యూరిటీ అతను మేడం ఇందాకే లోయ దగ్గరకు వెళ్లారు. కీస్‌ నాకు ఇచ్చి వెళ్లారు అని చెప్తాడు. ఏ లోయ దగ్గరకు అని అమర్‌ అడగ్గానే.. అదే యాక్టివిటీస్‌ జరుగుతాయి కదా సార్‌ అక్కడికే వెళ్లారు. మీరు వస్తే చెప్పమన్నారు అనగానే.. లాల్‌సింగ్‌ భయంగా మైగాడ్‌ ఈ మంచు తుఫానులో సిస్టర్‌ అక్కడికి ఎందుకు వెళ్లింది. అమర్‌ తుఫాన్‌ పెద్దగా అవుతుంది. నువ్వు వెంటనే ఫోన్‌ చేసి సిస్టర్‌ను త్వరగా వెనక్కి రమ్మని చెప్పు అనగానే..

అమర్‌, మిస్సమ్మకు ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ కలవడం లేదు అనగానే.. మైగాడ్‌ లోయ దగ్గర సిగ్నల్స్‌ ఉండవు.. పద వెళ్లి సిస్టర్‌ను తీసుకుని వద్దాం అంటాడు లాల్‌సింగ్‌.. దీంతో అమర్‌ వెయిట్‌ నేను వెళ్లి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండి రణవీర్‌ వైఫ్‌ వస్తే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకో అని చెప్పగానే.. లాల్‌సింగ్‌ ఓకే నువ్వు జాగ్రత్త.. సిస్టర్‌ను సేఫ్‌గా తీసుకురా..? తుఫాను ఎక్కువ అవ్వకముందే.. మీరు వెంటనే వెనక్కి వచ్చేయండి ఓకేనా.. అనగానే.. అమర్‌ అలాగే అంటూ అక్కడి న ఉంచి పరుగెత్తుకుంటూ కారు దగ్గరకు వెళ్లి కారు తీసుకుని వెళ్తాడు. మరోవైపు లోయ దగ్గర ఉన్న మిస్సమ్మను చంపడానికి మనోహరి మనుషులు రెడీగా ఉంటారు. దూరం నుంచి కారులో కూర్చుని గమనిస్తుంటుంది మనోహరి. ఇంతలో లోకల్‌ పోలీసులు వచ్చి మైకులో పోలీస్‌ వారి హెచ్చరిక మంచు తుఫాను ఎక్కువవుతుంది. టోర్నడోలు కూడా వస్తాయని వాతావరణ శాఖ వాళ్లు హెచ్చరిస్తున్నారు. అందరూ త్వరగా లోయను వదిలేసి వెళ్లిపోండి అని చెప్పగానే..

Advertisement

మిస్సమ్మను చంపాలనుకున్న రౌడీలు వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. మనోహరి కోపంగా పోలీసులు కూడా ఇప్పుడే రావాలా..? అనుకుంటుంది. మిస్సమ్మ అదేమీ పట్టనట్టు చూస్తూ ఉంటుంది. పోలీసులు దగ్గరకు వెళ్లి మేడం మంచు తుపాను ఎక్కువ అవుతుంది. టోర్నడోలు కూడా వస్తాయంటున్నారు. మీరు వెంటనే వెళ్లిపోవాలి. అని చెప్పగానే.. మిస్సమ్మ ఓకే సార్‌ అంటుంది. పారిపోయిన రౌడీలు మనోహరి దగ్గరకు వెళ్లి మేడం మంచు తుఫాను ఎక్కువ అవుతుందట. ఇక్కడ ఉంటే ప్రమాదం. మేము వెళ్తున్నాము మీరు కూడా వెళ్లండి మేడం లేదంటే మంచులో కూరుకుపోతారు.. అనగానే.. మనోహరి కోపంగా అరేయ్‌ మీరు వెళ్తే వెళ్లండిరా నేను భాగీని చంపే వెళ్తాను అంటుంది. దీంతో రౌడీలు సరే మీ ఇష్టం అంటూ పారిపోతారు. మనోహరి మాత్రం కోపంగా భాగీ అయిపోయావే ఇవాళ నువ్వు నా చేతిలో అనుకుంటూ ముందుకు వెళ్లబోతుంటే..

అప్పుడే అమర్‌ కారులో అక్కడికి వస్తాడు. అమర్‌ను చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ ఇప్పుడే రావాలా..? తను ఉండగా భాగీని ఏమీ చేయలేను.. పైగా అమర్‌ నన్ను ఇక్కడ చూశాడంటే చాలా ప్రమాదం.. డ్రైవర్‌ రిసార్ట్‌కు పోని త్వరగా పద.. అంటూ కారెక్కి వెల్లిపోతుంది. అమర్‌ గట్టిగా భాగీ అంటూ పిలుస్తుంటాడు. మిస్సమ్మ మాత్రం కనిపించదు. దీంతో పోలీసుల దగ్గరకు వెళ్లి మిస్సమ్మ ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఇక్కడ చూశారా..? అని అడగ్గానే.. ఇప్పుడే చూశాము సార్‌ ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పాము.. అనగానే.. అమర్‌ ఎటు వెళ్లింది అంటూ అడగ్గానే.. పోలీసులు మేము చూడలేదు సార్‌ పబ్లిక్‌ ను పంపించాలి మీరే చూసుకోండి అంటూ వెళ్లిపోతారు. అమర్‌ భాగీ భాగీ అంటూ గట్టిగా అరుస్తుంటాడు. ఇంతలో టోర్నడోలు తన వైపు రావడం చూసి భాగీ భయపడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Big Stories

Advertisement
×