E-Paper
Advertisement

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్
Advertisement

Malayalam Comedy Drama: మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఒక డాగ్ జీవితంలోకి వచ్చి అల్లకల్లోలం క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది ? కుక్కలు మన జీవితంలోకి వచ్చి ఎంత ఆనందం, గందరగోళం, ఎమోషన్ తీసుకువస్తాయో చూపించే హార్ట్‌ టచింగ్ కామెడీ డ్రామా ‘నెయ్‌మార్’ (Neymar). 2023లో తెరపైకి వచ్చిన ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఉంటాడు కుంజవా. అతను సింటో ఇద్దరూ ప్రాణ స్నేహితులు. బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ కు వీళ్ళు బిగ్గెస్ట్ ఫ్యాన్స్. కుంజవా తన క్లాస్‌మేట్ అయిన డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని సింటో సలహా మేరకు ఒక నాటు కుక్క పిల్లను కొనుక్కుంటారు. ఆ కుక్కకు వారు ముద్దుగా నెయ్‌మార్ అని పేరు పెడతారు. నెయ్‌మార్ రాకతో మొదట్లో అంతా బాగానే ఉన్నా, రోజులు గడిచేకొద్దీ అది చాలా అల్లరిగా, మొండిగా మారుతుంది.

Advertisement

ఆ కుక్క చేసే అల్లరి పనుల వల్ల కుంజవా ఇంట్లో, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులతో పెద్ద పెద్ద గొడవలు, సమస్యలు మొదలవుతాయి. ఆ గ్రామంలో నెయ్‌మార్ పేరు కామెడీ టాపిక్‌ గా మారిపోతుంది. ఒకరోజు నెయ్‌మార్ చేసిన ఒక పెద్ద తప్పు వల్ల విసిగిపోయిన కుంజవా తండ్రి, ఆ కుక్కను ఎవరికీ చెప్పకుండా ఎక్కడో దూర ప్రాంతంలో వదిలేస్తాడు. నెయ్‌మార్ లేకపోవడంతో కుంజవా తీవ్రమైన బాధలోకి వెళ్ళిపోతాడు. నెయ్‌మార్‌తో ఏర్పడిన బంధం విలువను తెలుసుకున్న ఇద్దరు స్నేహితులు, ఎలాగైనా దాన్ని తిరిగి వెతికి తీసుకురావాలని డిసైడ్ అవుతారు.

ఇక నెయ్‌మార్ ప్రస్తుతం తమిళనాడులోని పాండిచ్చేరిలో ఉందని వాళ్ళకి సమాచారం అందుతుంది. దాన్ని వెతకడానికి ఈ ఇద్దరు కుర్రాళ్ళు పాండిచ్చేరి వెళ్తారు. అయితే అక్కడ నెయ్‌మార్ ఒక ప్రొఫెషనల్ డాగ్ కాంపిటీషన్ నిర్వహించే ముఠా చేతిలో చిక్కినట్లు తెలుసుకుంటారు. ఆ గ్యాంగ్ నుండి తమకు ఇష్టమైన నెయ్‌మార్‌ను రక్షించడానికి అనేక సాహసాలు చేయాల్సి వస్తుంది. పాండిచ్చేరి వీధుల్లో నడుస్తూ, గ్యాంగ్ సభ్యులను ఎదుర్కొంటూ, నెయ్‌మార్‌ను వెతికే క్రమంలో కుంజవా, సింటోలు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి.

Advertisement

ఈ ప్రయాణంలో వాళ్ళు తమ స్నేహం విలువను, కుక్కతో ఏర్పడిన బంధం ఎంత లోతైనదో అర్థం చేసుకుంటారు. చివరకు కుంజవా, సింటోలు నెయ్‌మార్‌ను ఎలా కాపాడుకున్నారు ? చివరకు నెయ్‌మార్ తిరిగి తన ఇంటికి ఎలా చేరుకుంది ? అనే ఎమోషనల్ అండ్ హిలేరియస్ అంశాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

మాథ్యూ థామస్, నస్లెన్ కే గఫూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘నెయ్‌మార్’. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘777 చార్లీ’ తరహాలో ఒక కుక్క చుట్టూ తిరిగే అందమైన కథ. JioHotstarలో మలయాళంతో పాటు తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఒక కుక్కను పెంచాలనే కోరిక పెరగవచ్చు.

Read Also: అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

Tags

Related News

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

Big Stories

Advertisement
×