Tamil Mystery Thriller: దొంగతనం వంటి క్రేజీ అంశాల ఆధారంగా ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చూశాం మనం. దొంగలలో మంచి దొంగలు, చెడు దొంగలు కూడా ఉంటారు. కానీ దొంగతనానికి వెళ్ళి ఒక ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపడం, ఆ తర్వాత మొదలయ్యే మర్డర్స్ బలవ్వడం అన్నది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్ ‘తిరైవి’ (Thiraivi) కూడా అదే కోవలోకి వస్తుంది. మరి రాబరికి వెళ్తే… అది కాస్తా మర్డర్ మిస్టరీగా ఎలా టర్న్ తీసుకుంది ? ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమాలో హీరోయిన్ పేరు అదితి. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆ ఇంట్లోకి దొంగతనం చేయడానికి అన్బు అనే ఒక చిన్న దొంగ ఎంట్రీ ఇస్తాడు. అతను పేరుకే దొంగ. కానీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుపడి కాపాడతాడు. తరువాత ఆమె స్టోరీ ఏంటని అడుగుతాడు.
తన ఆత్మహత్య ప్రయత్నానికి విక్రమ్ అనే వ్యక్తి కారణమని, అతను ఆస్తి కోసం తన తండ్రిని చంపాడని అన్బుతో అదితి చెబుతుంది. అంతలోనే ఆ ఇంటి వాచ్‌మెన్ లోపలికి రావడంతో, గందరగోళంలో అన్బు చేతిలో ఉన్న గన్ తో వాచ్‌మెన్ ను కాల్చి చంపేస్తాడు. అక్కడ గన్ సౌండ్ విన్న పక్కింటి వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. కానీ పోలీసులు వచ్చి చూస్తే తీరా అక్కడేమీ ఉండదు. అంటే వాచ్ మెన్ శవం ఎక్కడా కనిపించదు.
అంతలోనే ముంబై నుండి విక్రమ్ హఠాత్తుగా ఇంటికి తిరిగి వస్తాడు. అదితి కంగారుపడి, విక్రమ్‌ను కూడా కాల్చి చంపేలా అన్బును రెచ్చగొడుతుంది. ఆమె అనుకున్నట్టుగానే అన్బు విక్రమ్‌ను కూడా కాలుస్తాడు. ఆ తర్వాతే అన్బుకు అదితి అసలు రంగు తెలుస్తుంది. అదితి తన ప్రియుడు గౌతమ్‌ను పరిచయం చేసి, ఆస్తి కోసం తామే విక్రమ్ తండ్రిని చంపామని, ఇప్పుడు జరిగిన హత్యలన్నింటికీ అన్బునే కారణమంటూ అతన్ని ఇరికించడానికి ప్లాన్ చేస్తారు. మరి అసలు నిజం తెలిసిన తరువాత అన్బు ఏం చేశాడు ? హీరోయిన్ ను ఎలా ఇరికించారు ? చనిపోయిన వాళ్ళిద్దరినీ ఏం చేశారు ? ఆ దొంగ ఈ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు ? క్లైమాక్స్ లో వచ్చే ఆ కిరాక్ ట్విస్ట్ ఏంటి ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను ఓటీటీలో వీక్షించాల్సిందే.
ఈ అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ కు కార్తీ దక్షిణామూర్తి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 29న థియేటర్లలోకి వచ్చింది. జులై నుంచి ShortFlix ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి ఇంగ్లీష్ లోనే మూవీని చూడాల్సి ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న సినిమాలను చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.
Read Also: పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా