E-Paper
Advertisement

Road Accident: రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న నాలుగు ట్రావెల్ బస్సులు, స్పాట్‌లో 26 స్టూడెంట్స్

Road Accident: రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న నాలుగు ట్రావెల్ బస్సులు, స్పాట్‌లో 26 స్టూడెంట్స్
Advertisement

Road Accident: రాజమండ్రి పట్టణంలోని దివాన్ చెరువు వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది వరకు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

రాజమండ్రిలో శివారులో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దివాన్ చెరువు వద్ద నాలుగు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వెంటనే బాధితులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులు నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల, కాలేజీకి చెందిన విద్యార్థులు. 9, 10, ఇంటర్‌ విద్యార్థులు మూడు రోజుల విహారయాత్రకు బయలుదేరారు. అందులో 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. రెండు బస్సుల్లో వీరంతా అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించి తిరిగి నల్గొండకు పయనమయ్యారు.

Advertisement

ఢీ కొన్న నాలుగు ట్రావెల్ బస్సులు, 26 విద్యార్థులకు గాయాలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రాజమండ్రి శివారులోని దివాన్ చెరువు ప్రాంతంలోని రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. అంతేకాదు రాత్రి-పగలు జాతీయ రహదారిపై ఆవులు, గెదేలు సంచరిస్తుంటాయి. ఈ ఘటన వెనుక ఇదే కారణమని తెలుస్తోంది.

అర్ధరాత్రి ఓ గేదె అడ్డం రావడంతో ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక నుంచి వస్తున్న మిగతా బస్సులు ఒకదానికి మరొకటి ఢీ కొట్టాయి. రెండు బస్సుల్లో 26 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకున్నారు. బాధితులను వెంటనే సమపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు.

ALSO READ: తల్లి సహజీవనంపై గొడవ.. కత్తి విసిరిన కొడుకు

మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువు సమీపంలోని ఓ మందిరానికి తరలించారు. తరచూ ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులను జాతీయ రహదారులపై రాకుండా రోడ్డుకి ఇరువైపులా ఐరన్ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×