E-Paper
Advertisement

భార్యాభర్తల మధ్య ఊహించని రచ్చ… నవ్విస్తూనే మతిపోగొట్టే ట్విస్టులున్న మలయాళ డ్రామా తెలుగులోనే

భార్యాభర్తల మధ్య ఊహించని రచ్చ… నవ్విస్తూనే మతిపోగొట్టే ట్విస్టులున్న మలయాళ డ్రామా తెలుగులోనే
Advertisement

Malayalam Family Drama: ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, ప్యాషన్ ఎంత సహజమో… చిన్న చిన్న పట్టింపులు, ఇగో గొడవలు కూడా అంతే సహజంగా వస్తుంటాయి. అయితే ఆ చిలిపి గొడవలు కాస్తా సరిహద్దులు దాటి, వీధికి ఎక్కితే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి ? వారి అమాయకత్వం, పట్టుదలలు ఇరుగుపొరుగున ఉండే వారికి ఎంతటి వినోదాన్ని పంచుతాయి అనే పాయింట్‌పై రూపొందిన ఆహ్లాదకరమైన మలయాళ డ్రామా ‘అంకం అట్టహాసం’ (Ankam Attahasam). మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక మధ్యతరగతి గ్రామీణ వాతావరణంలో కొత్తగా పెళ్లయిన జంట జీవితం చాలా సరదాగా, ఆనందంగా ప్రారంభమవుతుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు, అపార్థాలు రావడం మొదలవుతాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోవాలనే ఆలోచనతో ఇద్దరూ చేసే పనులు కాస్తా ఇంట్లో విపరీతమైన గందరగోళాన్ని కలిగిస్తాయి. భర్తను తిప్పలు పెట్టాలని, అతడి ఇగోను దెబ్బతీయాలని భార్య వేసే విచిత్రమైన స్కెచ్‌లు, ఆమెకు తగిన బుద్ధి చెప్పాలని భర్త చేసే కౌంటర్ అటాక్స్ చూసే ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తాయి. ప్రతి చిన్న విషయానికి వీరు చేసే హంగామా ఇంటిని రచ్చ రచ్చ చేస్తుంది.

Advertisement

ఈ చిన్న గొడవ కాస్తా క్రమంగా పెద్దదై బంధువులు, గ్రామంలోని పొరుగువారు కూడా ఇందులో జోక్యం చేసుకునేలా చేస్తుంది. ఇరుగు పొరుగు వారు ఆ గొడవను సర్దుమణిగించడానికి ప్రయత్నించినా, వీరు తగ్గకపోగా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ వీరు చేసే పనులు ఊరి జనం మొత్తానికి ఒక ఉచిత వినోద కార్యక్రమంగా మారిపోతాయి. అయితే, కథ కేవలం నవ్వులతోనే సాగిపోకుండా, వీరు పదే పదే గొడవ పడటానికి వెనుక ఒక బలమైన కారణం ఉందనే విషయాన్ని కథలో ఎంతో ఆసక్తికరంగా నడిపించారు.

జీవితంలో సంతోషంగా ఉండటానికి ఇగోలను పక్కన పెట్టడం ఎంత అవసరమో, దంపతుల మధ్య ఉండే చిన్న బంధాలు ఎంత విలువైనవో ఈ సినిమాలో చాలా చక్కగా ఆవిష్కరించారు. మలయాళ నేటివిటీకి అద్దం పడుతూ, ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంట్లో జరిగినట్లే అనుభూతి చెందేలా సన్నివేశాలను దర్శకుడు చాలా సహజంగా మలిచాడు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదో తెలుసుకునే సమయానికి కథ పలు ఊహించని మలుపులు తిరుగుతుంది.

Advertisement

మరి భార్యాభర్తల మధ్య ఉన్న ఈ ఇగో యుద్ధానికి చివరికి ఎలాంటి ముగింపు లభిస్తుంది? భర్తను ఆటపట్టించాలనుకున్న భార్య ప్లాన్ వర్కవుట్ అవుతుందా? వీరు ఇద్దరూ తమ తప్పులను తెలుసుకుని మళ్లీ ఒకటవుతారా లేదా గ్రామంలోని పెద్దలు వీరిని విడదీస్తారా? వీరి మధ్య ఉన్న అసలు సమస్య ఏమిటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

ఈ ఆకట్టుకునే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంకం అట్టహాసం’ చిత్రంలో మాధవ్ సురేష్, సైజు కురుప్, షైన్ టామ్ చాకో, అన్నా రాజన్, మాక్బూల్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు సుజిత్ ఎస్. నాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ (Sun NXT)లో ఆగస్టు 28 నుండి ఓటీటీలో ప్రసారమవుతోంది. తెలుగు డబ్బింగ్ ఆడియో కూడా అందుబాటులో ఉంది.

Read Also: బ్యాచిలరెట్ పార్టీలో దాగుడుమూతల ఆట… పెళ్లికూతురు వేసిన ప్లాన్‌కు రాత్రికి రాత్రే స్నేహితులు బలి

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×