Spanish Comedy Drama Series: బ్యాచిలరెట్ పార్టీ అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేయడమే. కానీ అదే పార్టీకి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరి రహస్యాలు బయటపడటం మొదలైతే ఎలా ఉంటుందో చూపించే సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఫ్రెండ్‌షిప్, లవ్, సీక్రెట్స్, ఎమోషన్స్ కలిసిన స్పానిష్ కామెడీ డ్రామా మినీ సిరీస్ ‘All the Truth in My Lies’ ఇప్పుడు Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలిసబెట్ బెనవెంట్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో ఒక బాచిలరెట్ ట్రిప్ ఎలా స్నేహితుల మధ్య దాచిన నిజాలను బయటకు తీసుకొచ్చిందనేదే అసలు కథ. మరి ఈ ట్రిప్‌లో ఏం జరిగింది? ఎవరి జీవితంలో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కోకో, మారిన్ ఇద్దరూ చాలా ఏళ్లుగా కలిసి ఉంటున్న మంచి స్నేహితులు. వాళ్లతో పాటు గస్, అరోవా, లోరెన్ వంటి స్నేహితుల బృందం ఉంటుంది. వీళ్లంతా కలిసి తమ స్నేహితురాలు బ్లాంకా బ్యాచిలరెట్ పార్టీని సెలబ్రేట్ చేసేందుకు కారవాన్‌లో రోడ్ ట్రిప్‌కు బయలుదేరుతారు. మొదట చూస్తే ఇది ఫుల్ ఫన్, పార్టీ, స్నేహితుల అల్లరి మాత్రమే అనిపిస్తుంది. కానీ ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే అసలు కథ మొదలవుతుంది.
కారవాన్‌లో అందరూ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండాల్సి రావడంతో, దాచిపెట్టిన విషయాలు బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎవరికెవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఎవరు తమ గత సంబంధాలను దాచిపెడుతున్నారు? ఎవరి జీవితంలో ఏం జరుగుతోంది? అనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. ముఖ్యంగా కోకో, మారిన్ మధ్య ఉన్న స్నేహం వెనుక దాగి ఉన్న చెప్పుకోలేని భావాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
ఇదే సమయంలో గ్రూప్‌లోని మరో వ్యక్తి తన మాజీ ప్రియుడిపై దృష్టి పెట్టడం, ఇంకొకరు తెలిసిన గాసిప్‌ను బయటపెట్టకుండా ఆపడం వంటి సంఘటనలు పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తాయి. ఒక సరదా బాచిలరెట్ ట్రిప్ చివరికి అందరి జీవితాలను మార్చే ప్రయాణంగా మారుతుంది. మరి ఈ ఫ్రెండ్స్ ఇంతకాలం దాచిన నిజాలు ఏంటి? ఆ నిజాలు బయటపడితే వాళ్ల స్నేహం నిలబడుతుందా? చివరికి ఎవరు ఎవరిని నమ్మగలరు? అనేదే ఈ సిరీస్‌లో చూడాల్సిన అసలు ట్విస్ట్.
మారియా టోగోరెస్, మెరీనా పెరెజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఐదు ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్‌లో డానియెల్ ఇబాన్యెజ్, ఇట్జియార్ మనెరో, రికార్డో గోమెజ్, లూసియా డి లా ఫుయెంటే, బ్రేస్ ఎఫే, క్లారా సాన్స్ తదితరులు నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 28, 2026న Netflixలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది స్పానిష్ ఒరిజినల్ సిరీస్ కాగా, హిందీ ఆడియో కూడా అందుబాటులో ఉంది. తెలుగులో లేదు. ఫ్రెండ్‌షిప్, లవ్, సీక్రెట్స్, రిలేషన్‌షిప్ డ్రామాతో పాటు ఫుల్ కామెడీ కావాలనుకునేవారికి ‘All the Truth in My Lies’ వీకెండ్‌లో బింజ్ చేయడానికి మంచి ఛాయిస్.
Read Also: స్టేజ్‌పై ర్యాప్ షో… తెరవెనుక ఊహించని ట్విస్ట్… గెలవడానికి ఏం చేశారో తెలిస్తే షాక్