E-Paper
Advertisement

BCB president Aminul Islam: వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడాల‌ని ఉంది..కానీ ఇండియాలో అడుగుపెడితే, చంపేస్తార‌ని వ‌ణుకు పుడుతోంది ?

BCB president Aminul Islam: వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడాల‌ని ఉంది..కానీ ఇండియాలో అడుగుపెడితే, చంపేస్తార‌ని వ‌ణుకు పుడుతోంది ?
Advertisement

BCB president Aminul Islam: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ పర్యటించడంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. నిన్న ఐసీసీ ప్రత్యేకంగా చర్చలు నిర్వహించి ఓటింగ్ పెట్టినప్పటికీ కూడా బంగ్లాదేశ్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దానికి తోడు ఇండియాను అవమానించేలా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. బంగ్లాదేశ్ క్రికెటర్లకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడాలని ఉంది.. అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు కూడా వరల్డ్ కప్ లో ఆడాలని ఉందన్నారు… కానీ ఇండియాలో పర్యటించాలని అంటేనే మనకు పుడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం. ఇండియాలో పర్యటిస్తే, బంగ్లాదేశ్ క్రికెటర్ల ప్రాణాలకే ముప్పు ఉంటుందని బాంబు పేల్చారు. దీంతో అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

ఇండియాలో పర్యటించాలంటే వణుకు పుడుతుంది

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు కేవలం 15 రోజుల సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు.. ఇటు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపిఎల్ లో ఆడకుండా ఆదేశాలు రావడం కారణంగా ఇండియా లాగే బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేస్తోంది.ఇక లేటెస్ట్ గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం ( BCB president Aminul Islam ) కూడా మరో కీలక ప్రకటన చేశాడు. టి20 ప్రపంచ కప్ ఆడాలని బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా కోరుకుంటున్నారు… బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా చాలా ఆసక్తిగా ఉంది.

కానీ ఇండియాకు వెళ్లి బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడడం అంటేనే మాకు వణుకు పుడుతోంది. అక్కడ బంగ్లాదేశ్ క్రికెటర్లు సేఫ్టీగా ఉంటారని మాకు నమ్మకం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ క్రికెట్ ప్రెసిడెంట్ ఇస్లాం. ఇండియాలో పర్యటిస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు హాని ఉంటుందని వివరించారు. లేకపోతే ఇప్పటికే ఇండియాకు వెళ్లి , ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే వాళ్ళమని క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఆటగాడి సేఫ్టీ మాత్రమే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమని ఆయన తెలిపారు. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా శ్రీలంకలో వేదికలు నిర్వహించాలని కోరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

బంగ్లాదేశ్ కు మ‌రో డెడ్ లైన్‌

Advertisement

ఐసీసీ మాత్రం కచ్చితంగా ఇండియాకు రావాల్సిందేనని డెడ్ లైన్ పెట్టింది. ఇవాళ సాయంత్రం లోపు తమ నిర్ణయాన్ని చెప్పాలని వెల్లడించింది. ఒకవేళ ఈ టోర్నమెంట్లో ఆడకపోతే స్కాట్లాండ్ ను తీసుకుంటామని ఐసీసీ పేర్కొంది. బంగ్లాదేశ్ ఆడితే మాత్రం ఇండియాకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×