E-Paper
Advertisement

ఆటో డ్రైవర్ కు దొరికే 5 కోట్ల విలువైన పురాతన విగ్రహం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

ఆటో డ్రైవర్ కు దొరికే 5 కోట్ల విలువైన పురాతన విగ్రహం… నరాలు కట్టయ్యే సస్పెన్స్
Advertisement

Suspense Thriller OTT : తమిళ సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్లు చాలా ఉన్నాయి. కానీ వాటిలో బెస్ట్ మూవీని వెతకడం అంటే అంత సులభమైన విషయం కాదు. మీరు కూడా ఇలాంటి సినిమాల కోసమే వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడవచ్చు ?

తమిళ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ‘kurangu bommai’ మూవీ కూడా ఒకటి. 2017లో విడుదలైన ఈ చిత్రానికి నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ఒక చిన్న బ్యాగ్ చుట్టూ తిరిగే కథలో భాగమైన అనేక మంది జీవితాలు ఎలా మారిపోతాయనే అంశాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు. సస్పెన్స్, ఎమోషన్, ట్విస్టులు వంటివి కావలసినన్ని ఉంటాయి. కతిర్ గా విధార్థ్, ఏకాంబరంగా భారతిరాజా, ఎలంగో కుమారవేల్ సింధనైగా, డెల్నా డేవిస్ – విజిగా, మీనాక్షి – సుందరం భార్యగా నటించారు. భారతిరాజా – ఎలంగో నటన గుర్తుండిపోతుంది.ఈ సినిమాను యూట్యూబ్ లో వీక్షించవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ ఏకాంబరం (భారతిరాజా) చుట్టూ మొదలవుతుంది. అతను తంజావూర్‌లో ప్రముఖ స్మగ్లర్ గా పేరు తెచ్చుకుంటాడు. పురాతన విగ్రహాలు, వస్తువులు స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదిస్తాడు. అతని దగ్గర పని చేసే సుందరం (మీనాక్షి) భర్త. సుందరం కుమారుడు కతిర్ (విధార్థ్) చెన్నైలో క్యాబ్ డ్రైవర్‌ గా పని చేస్తాడు. ఒకరోజు కతిర్ తన తల్లిదండ్రులతో కలిసి తన ప్రేయసి విజి ఇంటికి పెళ్లి ప్రతిపాదనతో వెళ్తాడు. కానీ సుందరం ఏకాంబరంతో సంబంధం ఉందని తెలిసి విజి తండ్రి వారిని అవమానిస్తాడు. కోపంతో కతిర్ అతన్ని కొడతాడు. ఈ ఘటన తర్వాత కథలో పెద్ద మలుపులు మొదలవుతాయి.

ఇక్కడే సింధనై (ఎలంగో కుమారవేల్) అనే పిక్‌ పాకెట్ పాత్ర ప్రవేశిస్తాది. అతనికి నిద్రపట్టదు. ఒకరోజు అతను ఒక బ్యాగ్ దొంగిలిస్తాడు. ఆ బ్యాగ్‌ లో ఉన్న వస్తువులు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆ బ్యాగ్ నుంచి మొదలైన ఘటనలు ఒక్కొక్కరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చాలా తెలివిగా చూపించారు. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది ? చివరికి అది ఎవరి చేతికి చిక్కింది ? అన్నది స్టోరీ.

Advertisement

Also Read : కడుపుతో ఉన్న కూతురిపై కసాయి తండ్రి క్రూరత్వం… రక్తాన్ని మరిగించే రివేంజ్ థ్రిల్లర్ సిరీస్

ఎందుకు ఇంత ప్రత్యేకం ?

ఒక చిన్న తప్పిదం ఎన్ని జీవితాలను ఎలా మార్చేస్తుందో, విధి వింత ఆట ఎలా ఉంటుందో ఇందులో బాగా చూపించారు. ప్రతి పాత్ర వెనుక ఒక కథ ఉంటుంది. ఎవరూ పూర్తి మంచి లేదా పూర్తి చెడు కాదు. అందరూ గ్రే షేడ్‌లో ఉంటారు. ఇది సినిమాకి బలం చేకూర్చింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఎక్కడా డ్రాగ్ అనిపించకుండా 2 గంటలకు మించకుండా కథను ముగించారు.

ఎందుకు చూడాలి ?

‘మంకీ బ్యాగ్’ సినిమా చూస్తే ఒక చిన్న బ్యాగ్ ఎంత పెద్ద ప్రభావం చూపించగలదో అర్థమవుతుంది. థ్రిల్, ఎమోషన్, సస్పెన్స్, ఫేట్ అన్నీ కలిపి అద్భుతమైన థ్రిల్లింగ్ ఫీలింగ్ ను ఇస్తుంది.

Tags

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×