E-Paper
Advertisement

1984లో ఎగిరి 2019లో కూలే విమానం… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

1984లో ఎగిరి 2019లో కూలే విమానం… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు
Advertisement

Indian Sci Fi Thriller OTT : ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ సిరీస్‌లు చాలా అరుదు. కానీ ‘JL50’ ఆ అరుదైన ప్రయత్నాల్లో ఒకటి. అభయ్ దేవల్, పంకజ్ కపూర్ నటించిన ఈ 4 ఎపిసోడ్ల మినీ సిరీస్ సోనీ లివ్‌లో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టైమ్ ట్రావెల్, రహస్యాలు, సైన్స్, థ్రిల్ కలిపి అద్భుతమైన అనుభవం ఇచ్చే సిరీస్ ఇది.

కథలోకి వెళ్తే…

1984లో కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన JL50 ఫ్లైట్ హఠాత్తుగా అదృశ్యమవుతుంది. 35 ఏళ్ల తర్వాత 2019లో అదే ఫ్లైట్ పశ్చిమ బెంగాల్‌ లో క్రాష్ అవుతుంది. కానీ ఇది సాధారణ ప్రమాదం కాదు. ఫ్లైట్ 35 ఏళ్లు ఎక్కడ ఉంది ? ఎలా తిరిగి వచ్చింది ? ఈ రహస్యాన్ని విచారించడానికి CBI అధికారి శాంతను (అభయ్ దేవల్) నియమిస్తారు. శాంతను దర్యాప్తు చేస్తూ ప్రొఫెసర్ సుబ్రతో దాస్ (పంకజ్ కపూర్)ను కలుస్తాడు. ఇందులో ప్రొఫెసర్ క్వాంటం ఫిజిక్స్ నిపుణుడు. ఆయన సహాయంతో శాంతను ఈ ఘటన వెనుక ఉన్న భారీ రహస్యాన్ని వెలికి తీస్తాడు. ఫ్లైట్‌ లో ఉన్న ఇద్దరు మనుషులు మాత్రమే బతికి ఉంటారు. అతను పైలట్, అలాగే మరొక ప్రయాణికుడు. వారి నుంచి వచ్చే సమాచారం ప్రతి ఎపిసోడ్‌ లో కథ కొత్త మలుపులు తిరిగేలా చేస్తుంది. కథలో టైమ్ ట్రావెల్, పారలల్ యూనివర్స్, చరిత్ర మార్చడం వంటి సైన్స్ ఫిక్షన్ అంశాలు గట్టిగా ఉంటాయి. భారతీయ స్టైల్‌ లో తీసిన ఈ సిరీస్ పశ్చిమ సై-ఫై సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మరి 35 ఏళ్ల క్రితం మిస్సైన ఫ్లైట్ ఇప్పుడెలా క్రాష్ అయ్యింది ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది చూసి తెలుసుకోవలసిన స్టోరీ. నిజానికి ఇలాంటి స్టోరీలు హాలీవుడ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ మన ఇండియన్ స్టైల్ లో చూడడం అన్నది సైన్స్ ఫిక్షన్ మూవీ లవర్స్ కు ఐ ఫీస్ట్ లాంటిది.

Advertisement

Also Read : ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా పరుగులు తీసే సౌత్ మూవీస్… చివరి క్షణం వరకూ వీడని సస్పెన్స్

మినీ సిరీస్

ఇందులో అభయ్ దేవల్ – శాంతను అనే CBI అధికారిగా, పంకజ్ కపూర్ – ప్రొఫెసర్ సుబ్రతో దాస్ గా, రితికా ఆనంద్ – బిహు ఘోష్ అనే పైలట్ గా, పియూష్ మిశ్రా – బిస్వజిత్ చంద్ర మిత్రాగా, రాజేష్ శర్మ – గౌరాంగ్ గా నటించారు. ‘JL50’ టైమ్ ట్రావెల్ థియరీని ఇండియన్ స్టైల్ లో తీసిన సిరీస్. రహస్యాలు, సైన్స్, ఎమోషన్, సస్పెన్స్ వంటి థ్రిల్ ఇచ్చే అంశాలు మెండుగా ఉంటాయి. 4 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒక్కసారిలోనే పూర్తి చేసేయవచ్చు. సై-ఫై ఇష్టపడే వాళ్లు మిస్ అవ్వకుండా చూడాల్సిన సిరీస్ ఇది. హిందీలో వచ్చినా సబ్‌టైటిల్స్‌తో తెలుగు ప్రేక్షకులు సులభంగా ఆస్వాదించవచ్చు.

Advertisement

Also Read : IMDbలో 8.5 రేటింగ్… ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్ క్లైమాక్స్ చూస్తే బుర్ర తిరిగిపోద్ది భయ్యా

Tags

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×