OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా వచ్చిన కొన్ని సిరీస్ లు సంచనాలు సృష్టించాయి. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ వీటిలో చాలానే ఉన్నాయి. వీటిని చూస్తున్నప్పుడు, అమ్మో ఇది నిజంగా జరిగిందా? అని షాక్ అయ్యేలా ఈ స్టోరీలు ఉంటాయి. కాశ్మీర్ ఘోష, ముంబై టెర్రర్ అటాక్, గొధ్రా ట్రెయిన్ బర్నింగ్… ఒక్కో సీన్ చూస్తే గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. వీవేక్ అగ్నిహోత్రి ‘ఫైల్స్’ ట్రైలాజీ (కాశ్మీర్, తష్కెంట్, బెంగాల్) మూవీలు ఇండియా హిస్టరీలో దాచిన చీకటి పేజీల్ని బయటపెడతాయి. చరిత్ర దాచిన సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ సినిమాలను ఒక్కసారి చూస్తే ఆపడం కష్టమే. ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? వీటి వివరాలు ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్‌లో 2022లో వచ్చిన ఈ మూవీ, 1990లలో కాశ్మీర్ వ్యాలీలో జరిగిన కాశ్మీరీ పాండిట్స్ మీద జరిగిన హత్యలు, బెదిరింపులను చూపిస్తుంది. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు. అగ్నిహోత్రి రూపొందించిన ఫైల్స్ త్రయంలో ఇది రెండవ చిత్రం. దీనికి ముందు వచ్చిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ కూడా రియల్ స్టోరీతో హీట్ పుట్టించింది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మొదట ప్రపంచవ్యాప్తంగా 2022 జనవరి 26న భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా వాయిదా వేయబడి 2022 మార్చి 11న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ జాతీయ చిత్రంగా, పల్లవి జోషి జాతీయ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. ఇది ZEE5లో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఆంథోనీ మారాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2018లో వచ్చింది. 2008 డిసెంబర్ 26న ముంబైలో లష్కర్-ఎ-తొయిబా టెర్రరిస్టులు జరిపిన అటాక్‌ని ఈ సినిమా రీక్రియేట్ చేసింది. తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబేరయ్ రెస్టారెంట్‌లో జరిగిన షూటింగ్, బాంబ్ బ్లాస్ట్ లలో 166 మంది మరణాలను రియల్ ఫుటేజ్ లాగా చూపించారు. ఇందులో అజ్మల్ కసాబ్ లాంటి టెర్రరిస్టులు హత్యలు చేస్తుంటే, హోటల్ స్టాఫ్ గెస్ట్స్‌ని కాపాడటానికి పోరాడతారు. ఈ సినిమాని చూస్తే మీరు ఆ రోజు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. Netflixలో ఈ సినిమా ని తెలుగులో కూడా చూడవచ్చు.
వివేక్ అగ్నిహోత్రి 2019లో తీసిన కాన్‌స్పిరసీ థ్రిల్లర్ ఈ సినిమా. భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1966లో తష్కెంట్ లో ఇండో-పాక్ యుద్ధం ముగింపు శాంతి ఒప్పందం సైన్ చేసిన కొన్ని గంటల తర్వాత ‘హార్ట్ అటాక్’ తో చనిపోయినట్టు అధికారికంగా చెప్పారు. కానీ నిజమేంటి? జర్నలిస్ట్ రాగిని (శ్వేతా బాసు ప్రసాద్) ఒక సీక్రెట్ డాక్యుమెంట్ పొంది, శాస్త్రి మరణం కాన్‌స్పిరసీ అని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇందులో నసీరుద్దీన్ షా, పంకజ్ త్రిపాఠి, మిథున్ చక్రబోర్తి, వినయ్ పాఠక్ లాంటి స్టార్స్ ఎన్‌జీఓలు, పాలిటీషియన్స్, స్పయ్ లుగా కనిపిస్తారు. ZEE5 లో ఇది అందుబాటులో ఉంది.
2024లో వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ పాలిటికల్ డ్రామా, 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో 59 మంది హిందూ కర్‌సేవకులు (అయోధ్యకు వెళ్తున్నారు) దహనానికి గురయ్యారు. ఈ కథ జర్నలిస్ట్ సమర్ (విక్రాంత్ మాసే) చుట్టూ తిరుగుతుంది. అతను ఈ కేసు రీఓపెన్ చేసి, పాలిటీషియన్స్, మీడియా, పోలీస్ మధ్య ఒక గేమ్ ఎక్స్‌పోజ్ చేస్తాడు. ఇందులో రుద్రాణీ చటర్జీ, రాహుల్ భోపాల్ లీడ్ రోల్స్ లో ఉన్నారు. ZEE5లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : పెళ్లంటే నూరేళ్ళ మంట… కళ్ళు తెరిపించే సెటైరికల్ డార్క్ కామెడీ చిత్రం