E-Paper
Advertisement

5k Run For Peace: రేపే హైదరాబాద్ లో ‘5కే రన్ ఫర్ పీస్’ ఈవెంట్.. రూ.25 వేలు గెలుచుకునే ఛాన్స్

5k Run For Peace: రేపే హైదరాబాద్ లో ‘5కే రన్ ఫర్ పీస్’ ఈవెంట్.. రూ.25 వేలు గెలుచుకునే ఛాన్స్
Advertisement

5k Run For Peace: రేపు హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన ‘5k రన్ ఫర్ పీస్’ ఈవెంట్ నిర్వహించనున్నారు. శాంతిని పెంపొందించడం, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 23, ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 5కే రన్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ‘జాయ్ కార్నివాల్’ పేరుతో ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించనున్నారు. ఫిట్ నెస్ ప్రియులకు, రన్నింగ్ లవర్స్ కు, నగర వాసులకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. విజేతలకు ఆకర్షణీయమైన క్యాష్ ప్రైజ్ లను ప్రకటించారు.

ముఖ్యమైన తేదీలు

Advertisement

5కే రన్ లో పాల్గొనడానికి నవంబర్ 20 వరకు రిజిస్ట్రేషన్ కల్పించారు. రూ.300 నామమాత్రపు ఫీజుతో ఈవెంట్ లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. ఈవెంట్ పై మరిన్ని వివరాలకు 7207827160, 7995463344 నంబర్లను సంప్రదించవచ్చు.

బహుమతులు ఇవే

ఈ 5K పరుగులో విజేతలకు భారీ నగదు బహుమతులు ఉన్నాయి.

  • మొదటి బహుమతి: రూ.25,000
  • రెండవ బహుమతి: రూ.15,000
  • మూడవ బహుమతి: రూ.10,000
Advertisement

నగదు బహుమతులతో పాటు విజేతలకు స్థానాలు దక్కించుకున్న వారికి పతకాలు కూడా అందజేయనున్నారు. రన్నింగ్ రేస్ లో పాల్గొనేవారికి ప్రత్యేకంగా రన్నింగ్ టీ షర్ట్, ఫినిషర్ మెడల్, మెడికల్ సపోర్ట్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

ఈవెంట్ ఆర్గనైజర్స్‌లో బిగ్ టీవీ

ఈ కార్యక్రమాన్ని స్వయం సిద్ధి, ప్రియ ఈవెంట్జ్, వైబ్, తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ,ఎస్ఎస్ఎఫ్, హైదరాబాద్ మోడల్స్, ఎంట్రీ వాలా,అడ్వకేట్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, అనేక ఇతర సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డీడీహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ఆర్కాడియా వంటి సంస్థలు కూడా సపోర్టుగా నిలిచాయి.

5కె రన్ పోటీ కేవలం ఒక రేసు కాదు అని ఈవెంట్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇది సమాజంలో శాంతియుత వాతావరణం పెంపొందించడానికి, ఆరోగ్య స్ఫూర్తిని నింపడానికి ఉద్దేశించిన కార్నివాల్ అని తెలిపారు. ఈ వేడుకలో భాగంగా పాల్గొనేవారు అద్భుతమైన అనుభూతిని పొందుతారని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఇలాంటి ఈవెంట్‌లో హైదరాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

నగరంలో ఆనందమైన వాతావరణం నెలకొల్పడానికి ఈ ఈవెంట్ లో పాల్గొనవచ్చు. 5కే రన్ క్రీడా కార్యక్రమాలు యువతను క్రీడల వైపు మళ్లిస్తాయి. నవంబర్ 23న ఉదయం నెక్లెస్ రోడ్ కొత్త ఉత్సాహంతో కళకళలాడనుంది.

Also Read: CM Revanth Reddy: తెలంగాణ ఆత్మగౌరవ పతాకలు కవులు, కళాకారులు: సీఎం రేవంత్ రెడ్డి

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×