E-Paper
Advertisement

Sneh Rana : మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. పీరియడ్స్ నొప్పులతో నరకం అనుభవిస్తున్నాం..!

Sneh Rana : మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. పీరియడ్స్ నొప్పులతో నరకం అనుభవిస్తున్నాం..!
Advertisement

Sheh Rana :  సాధార‌ణంగా మ‌హిళ‌లు వంటిటికే ప‌రిమిత‌మైన కాలం నుంచి ప్ర‌స్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుతం క్రీడ‌ల్లో మ‌హిళ‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్నో ఏళ్ల కల 2025 వ‌రల్డ్ క‌ప్ సాధించ‌డంతో సాధ్య‌మైంది. ఈ నేప‌థ్యంలోనే భార‌త మ‌హిళా క్రికెట‌ర్ స్నేహ్ క్రికెట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేసింది. ముఖ్యంగా టీమిండియా మ‌హిళా జ‌ట్టులో ఆడేట‌ప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. పీరియ‌డ్స్ స‌మ‌యానికి రావు.. దాని వల్ల ఇరిటేష‌న్, న‌ర‌కం అనుభ‌విస్తామ‌ని తెలిపారు.

Also Read : Naseem Shah: పాక్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు..తుక్కు తుక్కైన కారు

అలా అయినా టీమిండియా కోసం ఆడాల్సిందే..!

Advertisement

పీరియ‌డ్స్ వ‌చ్చిన‌ప్పుడు క‌డుపునొప్పితో బాధ‌ప‌డ‌తాం. అయినా టీమిండియా కోసం ఆడాల్సిందే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం స్నేహ్ రానా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాస్త‌వానికి మ‌హిళ‌లు పీరియ‌డ్స్ స‌మ‌యంలో న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తార‌ని చాలా సంద‌ర్భాల్లో ప‌లువురు మ‌హిళ‌లు పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సినీ నటి ర‌ష్మికా మంధ‌న్న అయితే ఏకంగా మ‌హిళ‌ల‌కు వ‌చ్చే పీరియ‌డ్స్ మ‌గ‌వారికి వ‌స్తే.. ఆ బాధ ఏంటో మ‌గ‌వారికి అర్థం అవుతుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం విశేషం. మ‌రోవైపు బంగ్లాదేశ్ క్రికెట‌ర్ సైతం ఇటీవ‌ల పీరియ‌డ్స్ గురించి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం స్నేహ్ రానా చేసిన కామెంట్స్ వైర‌ల్ కావ‌డం విశేషం.

వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యంతో టీమిండియా క్రికెట‌ర్ల‌కు ప్ర‌శంస‌లు

టీమిండియా మ‌హిళ‌లు అన్నింటిని త‌ట్టుకొని సొంత గ‌డ్డ‌పై వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం అనే చెప్పాలి. ఆమె 2014లో శ్రీలంకకు వ్యతిరేకంగా మహిళల వన్డే అంతర్జాతీయ వన్ డే ఇంటర్నేషనల్, మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2016లో మోకాలి గాయం తర్వాత ఆమెను కొద్ది రోజులు ప‌క్క‌కు పెట్టారు. అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడే అవ‌కాశం రాలేదు. అదే స‌మ‌యంలో ఆమె దేశ‌వాళీ క్రికెట్ లో ఆడింది. ఇండియా బీ త‌ర‌పున కూడా ఆడింది. 2021 మేలో, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆమె భారత టెస్ట్ జట్టులో ఎంపికైంది. ముఖ్యంగా రాణా 2021 జూన్ 16 న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన టెస్టు అరంగేట్రం చేసింది. టెస్ట్ ల్లో ప‌లు రికార్డుల‌ను న‌మోదు చేసింది. సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన తొలి భార‌తీయురాలుగా రికార్డు నెల‌కొల్పింది. ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం విశేషం. సౌతాఫ్రికా తో జ‌రిగిన ఫైన‌ల్ లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో టీమిండియా క్రికెట‌ర్ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సైతం అభినందించిన విష‌యం తెలిసిందే.

Advertisement

Also Read : Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ ఆక్సిజన్ లెవల్స్ 50 శాతం డ్రాప్… ద‌క్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్ కు దూరం

?igsh=cjlra2hyNWNzdXBm

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×