E-Paper
Advertisement

Mark On OTT : ఓటీటీలోకి కిచ్చా సుదీప్ ‘మార్క్’… ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

Mark On OTT : ఓటీటీలోకి కిచ్చా సుదీప్ ‘మార్క్’… ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Advertisement

Mark On OTT : థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అలా కిచ్చా సుదీప్ ఫ్యాన్స్‌కు 2025 క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ గా వచ్చిన మూవీ ‘మార్క్’. ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ థియేటర్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఈ మూవీ ఓటీటీ విడుదలపై ఉంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 

మార్క్ (Mark) 2025లో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. డైరెక్టర్ విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (అజయ్ మార్కండే – సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్) హీరోగా నటించాడు. కీ రోల్స్‌లో నవీన్ చంద్ర, యోగి బాబు, గురు సోమసుందరం, డ్రాగన్ మంజు, షైన్ టామ్ చాకో నటించారు. యాక్షన్ థ్రిల్లర్, క్రైమ్ కలగలిపి రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 30 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తోంది.

Advertisement

థియేటర్స్‌లో రన్ పూర్తయిన తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. గతంలో ZEE5, Amazon Prime Videoలో మూవీ రిలీజ్ అవుతుందని పుకార్లు వచ్చాయి. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం Jio Hotstar ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2026 జనవరిలో అంటే థియేట్రికల్ రన్ అనంతరం 4-6 వీక్స్ తర్వాత స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు.

స్టోరీలోకి వెళ్తే…

కథ సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ అజయ్ మార్కండే (కిచ్చా సుదీప్) చుట్టూ తిరుగుతుంది. కఠినంగా ఉండే ఈ పోలీస్ ఆఫీసర్ కొన్ని కారణాలతో సస్పెండ్ అయ్యాడు. విధుల్లోకి తిరిగి వచ్చిన తర్వాత, ఒక పెద్ద క్రైమ్ కేసును హ్యాండిల్ చేస్తాడు. శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్లు, అవినీతిపరులైన రాజకీయ నాయకులు, పవర్‌ఫుల్ మాఫియా నెట్‌వర్క్‌ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇక హీరో న్యాయం కోసం ఒంటరిగా పోరాడుతూ, బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో విలన్స్‌ను మట్టి కరిపిస్తాడు. కథలో ట్విస్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్, హై-వోల్టేజ్ ఫైట్స్ వంటివి కావలసినన్ని ఉంటాయి. సుదీప్ ఇంటెన్స్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ హైలైట్. పోలీస్ సిస్టమ్ లోపాలు, అవినీతి, రివెంజ్ జర్నీని ఆసక్తికరంగా ఈ మూవీలో చూపించారు. మరి ఇంతకీ హీరో డీల్ చేసిన క్రైమ్ ఏంటి? విలన్ల తుక్కు ఎలా రేగగొట్టాడు అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్’ స్ట్రీమింగ్… తెలుగులో చూడాలా ? ఈ ఆప్షన్ ట్రై చేయండి

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×