E-Paper
Advertisement

Dehradun Student Clash: డెహ్రాడూన్‌‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

Dehradun Student Clash: డెహ్రాడూన్‌‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
Advertisement

Dehradun Student Clash: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు త్రిపురకు చెందిన ఏంజెల్ చక్మా అనే విద్యార్థిగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

డెహ్రాడూన్‌లోని ఒక విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదమే.. ఈ ఘర్షణకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మాటామాటా పెరగటంతో ఈ ఘర్షణ తీవ్ర వివాదానికి దారితీసింది.

Advertisement

ఘటనపై వెంటనే స్పందించిన డెహ్రాడూన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణకు నేరుగా పాల్పడినట్లు అనుమానిస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి సమాచారం అందిస్తే రూ.25,000 రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

ఈ ఘటన నేపథ్యంలో డెహ్రాడూన్‌లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల్లో భయం నెలకొంది. నగరంలో దాదాపు 400 మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో , అద్దె గదుల్లో నివసిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వీరి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

ఘటన అనంతరం ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని.. డెహ్రాడూన్ పోలీసులు తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో గస్తీని పెంచినట్లు, సీసీటీవీ నిఘాను మరింత బలోపేతం చేసినట్లు వెల్లడించారు. అవసరమైతే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. విద్యార్థులు భయాందోళనకు గురికావద్దని, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Also Read: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!

మరోవైపు, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని డెహ్రాడూన్ పోలీసులు స్పష్టం చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×