E-Paper
Advertisement

Palnadu District: పిడుగురాళ్ల సీఐ వేధింపులతో.. మహిళ ఆత్మహత్యాయత్నం

Palnadu District: పిడుగురాళ్ల సీఐ వేధింపులతో.. మహిళ ఆత్మహత్యాయత్నం
Advertisement

Palnadu District: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకున్న  ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక ధాన్యం వ్యాపారి భార్య అయిన జ్యోతి.. పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పోలీసుల పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

పిడుగురాళ్లకు చెందిన ఓ ధాన్యం వ్యాపారి భార్య జ్యోతిని..  పిడుగురాళ్ల సీఐ వెంకటరావు వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తమపై ఎటువంటి కేసులు లేకపోయినప్పటికీ..  పోలీసులు అనవసరంగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొంది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే పోలీసులు తనను బలవంతంగా స్టేషన్‌కు తీసుకువెళ్లారని..  అక్కడ తనను సెల్‌లో వేసేందుకు ప్రయత్నించారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా పిడుగురాళ్ల సీఐతో పాటు టీడీపీ నాయకులు కలిసి సివిల్ సెటిల్‌మెంట్లు నిర్వహిస్తున్నారని.. తన భర్తను పోలీస్ స్టేషన్‌లో బంధించి.. సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను బలవతంగా తమకు రాయించుకున్నారని జ్యోతి  ఆరోపించారు.

Advertisement

సీఐ ప్రవర్తన,  పోలీసుల వేధింపులు భరించలేకపోయిన జ్యోతి..  తీవ్ర మనస్తాపానికి గురైంది. స్టేషన్ లోపలే తన వెంట ఉన్న కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రక్తం ఓడుతున్న స్థితిలో ఆమెను చూసిన సిబ్బంది వెంటనే స్పందించి..  చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ‘మేము ఏ తప్పూ చేయలేదు..  మాపై ఎలాంటి కేసులు లేవు.. మరి మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు’ అంటూ ఆమె అధికారులను ప్రశ్నించింది.

ఈ ఘటనపై ప్రజల నుండి, బాధితురాలి బంధువుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలీసుల వైఫల్యం బయటపడుతుందనే భయంతో..  ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఎవరికీ కనిపించకుండా పోలీసులు దాచిపెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఉదంతం జిల్లా పోలీసు యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని..  బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ: Mahabubnagar: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×