BigTV English

OTT Movie : 16 ఏళ్ల అమ్మాయిల్ని మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… ఎందుకో తెలిస్తే దిమాక్ కరాబ్

OTT Movie : 16 ఏళ్ల అమ్మాయిల్ని మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… ఎందుకో తెలిస్తే దిమాక్ కరాబ్
Advertisement

OTT Movie : సీరియల్ కిల్లర్ సినిమాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఈ సినిమాలు చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ 1980 స్పెయిన్‌లో, ఫ్రాంకో నియంతృత్వం ముగిసిన తర్వాత గ్వాడల్కివిర్ మార్ష్‌ల్యాండ్స్‌లోని ఒక పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ పెడ్రో సువారెజ్ (రావుల్ అరేవలో), జువాన్ రోబ్లెస్ (జావియర్ గుటిరెజ్) అనే ఇద్దరు హోమిసైడ్ డిటెక్టివ్‌లు, ఇద్దరు టీనేజ్ అమ్మాయిల మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయడానికి రావడంతో స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….


Amazon Prime Video లో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మార్ష్‌ల్యాండ్’ (Marshland). 2014 లో విడుదలైన ఈ సినిమాకి ఆల్బెర్టో రోడ్రిగెజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 29 వ గోయా అవార్డులలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు (గుటిరెజ్) సహా 10 అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది,


స్టోరీలోకి వెళితే

1980లో స్పెయిన్ ఫ్రాంకో నియంతృత్వ పరిపాలన నుండి ప్రజాస్వామ్యానికి మారుతున్న సమయంలో, ఇద్దరు డిటెక్టివ్‌లు ఒకరికొకరు విభిన్న వైఖరులు కలిగి ఉంటారు. పెడ్రో ఫ్రాంకో పరిపాలనను విమర్శించి, ప్రజాస్వామ్యాన్ని సమర్థించే ఒక యువ డిటెక్టివ్ అయితే, జువాన్ ఫ్రాంకో రాజ్యంలో ఒక సీక్రెట్ ఏజెంట్ గా అనుభవం ఉన్న వ్యక్తి. వీళ్ళు పట్టణంలోని ఈ పండుగ సమయంలో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయడానికి వస్తారు. ఈ దర్యాప్తులో వీళ్ళకి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. త్వరలోనే ఈ మిస్సింగ్ వెనుక ఒక సీరియల్ కిల్లర్‌ కి సంబంధం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి హత్యలు జరిగి ఉంటాయి. అయితే వీళ్ళు దర్యాప్తు సాగించే క్రమంలో, స్థానికుల సహకారం లేకపోవడంతో ఈకేసును ఛేదించేందుకు వీళ్ళు ఇబ్బందులు పడాల్సివస్తుంది.

అయినప్పటికీ వీళ్ళు కలిసి ఈ కేసును పరిష్కరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, సీరియల్ కిల్లర్‌ కి, ఫ్రాంకో ప్రభుత్వానికి ఉన్న లింకులు కూడా వెలుగులోకి వస్తాయి. ఆ తరువాత ఈ కేసు ఉహించని మలుపులు తిరుగుతుంది. చివరికి ఈ డిటెక్టివ్‌లు ఆ హంతకున్ని పట్టుకుంటారా ? ఫ్రాంకో ప్రభుత్వానికి, కిల్లర్ కి ఉన్న సంబంధం ఏమిటి ? అమ్మాయిల్ని కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు ?
ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : పెళ్లి ఫిక్సయిన అమ్మాయిలు కిడ్నాప్… చేతులు నరికి, ముక్కలు ముక్కలుగా పారేస్తూ కిరాతకంగా చంపే సైకో కిల్లర్

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×