OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు సీను సీనుకో ట్విస్ట్ తో వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. ఇలాంటి థ్రిల్ కోసమే సైకలాజికల్, సైకో థ్రిల్లర్ సినిమాలను చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈరోజు కూడా అలాంటి థ్రిల్లర్ మూవీనే మన మూవీ సజెషన్. మరి ఈ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
ఆహాలో స్ట్రీమింగ్
ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Operation Raavan’. హైదరాబాద్ లో వివాహమయ్యే యువతులను టార్గెట్ చేసే సీరియల్ కిల్లర్, వాడిని పట్టుకోవడానికి ట్రై చేసే ఒక జర్నలిస్ట్ కథ ఇది. ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకునే ఈ క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, సైకలాజికల్ డ్రామాకు వెంకట సత్య దర్శకత్వం వహించారు. రక్షిత్ అట్లూరి (రామ్), సంగీర్థన విపిన్ (ఆమని), రాధికా శరత్‌కుమార్ (సుజాత/జీవిత), చరణ్ రాజ్, రఘు కుంచె (మినిస్టర్), వినోద్ సాగర్ తదితరులు ఈ మూవీలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Ahaలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
హైదరాబాద్‌లో ఒక సీరియల్ కిల్లర్ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపుతాడు. వాళ్ళ చేతులను నరికి, దగ్గరలో పార్ట్స్ పార్ట్స్ గా పారేస్తూ, అతి కిరాతకంగా హత్యలు చేస్తాడు. రామ్ (రక్షిత్ అట్లూరి) అనే యువ జర్నలిస్ట్ ఓ టీవీ ఛానల్ లో సీనియర్ జర్నలిస్ట్ ఆమని (సంగీర్థన విపిన్) అసిస్టెంట్‌గా చేరతాడు. ఆమని ఒక రాజకీయ నాయకుడి (రఘు కుంచె) రూ.100 కోట్ల అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె బాస్ (మూర్తి) ఆమెను ఈ కేసు నుండి తప్పించి, సీరియల్ కిల్లర్ హత్యల కేసును కవర్ చేయమని ఆదేశిస్తాడు.
రామ్, ఆమని డెడికేషన్‌ను చూసి ఆకర్షితుడై, ఆమెతో కలిసి ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. పోలీసు ఆఫీసర్ (చరణ్ రాజ్) ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతాడు. ఒక మిస్సింగ్ అమ్మాయి తల్లి సుజాత (రాధికా శరత్‌కుమార్) ఈ కేసుకు కీలకమైన సూత్రధారిగా కనిపిస్తుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, రామ్ ఒక పవర్‌ఫుల్ వ్యాపారవేత్త కొడుకుగా తన గుర్తింపును దాచి, చానల్‌లో చేరినట్లు తెలుస్తుంది. అంతలోనే ఆమని కిడ్నాప్ అవుతుంది.
Read also : బీచ్ ఒడ్డున డెడ్ బాడీ… ఆ అమ్మాయి శవం చుట్టే మిస్టరీ అంతా… పోలీసులకు చెమటలు పట్టించే కేసు
ఇక్కడే కిల్లర్ గతం, జీవిత (రాధికా శరత్‌కుమార్) అనే మహిళతో సంబంధం, హత్యల వెనుక ఉన్న ఉద్దేశం ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా వెల్లడవుతాయి. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? అతని గతం, జీవితతో ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిలనే ఎందుకు చంపుతున్నాడు? అనేది తెలియాలంటే మూవీని వీక్షించండి.