Medical Drama Web series OTT : ఓటీటీలో ఒక మెడికల్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇది ఇప్పటికే తొమ్మిది సీజన్ లతో ఆడియన్స్ ను అలరించింది. తొమ్మిదవ సీజన్ ముగిసిన 16 ఏళ్ల తర్వాత వచ్చిన రివైవల్ సిరీస్ ఇది. ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టకుండా సరదాగా సాగుతుంది ఈ సిరీస్. ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఎమోషన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఈ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘స్క్రబ్స్’ (Scrubs) సీజన్ 10. 2026 ఫిబ్రవరి 25న వచ్చిన ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ఆకుతోంది. ఈ సీజన్‌లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉండగా, ఇప్పుడు రెండింటిని మాత్రమే రిలీజ్ చేశారు. మిగతావి వారానికి ఒకటి చొప్పున ప్రతి బుధవారం ప్రసారమవుతాయి. దీని మొదటి సీజన్ (Season 1) 2001న ప్రారంభమైంది.ఇందులో మొత్తం 24 ఎపిసోడ్లు ఉన్నాయి.
ఇక తొమ్మిదవ సీజన్ 2009 డిసెంబర్ 1న వచ్చింది. ఇప్పుడు అంటే దాదాపు 16 ఏళ్ల తర్వాత సీజన్ 10 స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో పాత నటులు జాక్ బ్రాఫ్ (J.D.), డొనాల్డ్ ఫైజన్ (టర్క్), సారా చాల్కే (ఇలియట్) ప్రధాన పాత్రల్లో తిరిగి వచ్చారు.
తొమ్మిదో సిరీస్ ముగిసిన 16 ఏళ్ల తర్వాత సెక్రెడ్ హార్ట్ హాస్పిటల్‌లో కథ మళ్ళీ మొదలవుతుంది. జేడీ ఇప్పుడు హాస్పిటల్‌కి కొత్త చీఫ్ ఆఫ్ మెడిసిన్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. అతని ప్రాణ స్నేహితుడు టర్క్ సర్జరీ డిపార్ట్మెంట్ చూసుకుంటుంటే, ఇలియట్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే, జేడీ – ఇలియట్ విడిపోయి ఉంటారు. కానీ తమ పిల్లల కోసం స్నేహంగా ఉంటూ కలిసి పని చేయాల్సి వస్తుంది. అయితే జేడీ మాత్రం మళ్ళీ మునుపటి లాగా హాస్పిటల్‌లో హడావిడి చేస్తుంటాడు. మరోవైపు హాస్పిటల్‌లోకి కొత్తగా ఒక ఇంటర్న్స్ బ్యాచ్ అడుగుపెడుతుంది. వీళ్ళకి గైడ్‌గా జేడీ ఉంటాడు. అలాగే డాక్టర్ కాక్స్ రిటైర్ అవ్వాలని అనుకున్నా, తనదైన స్టైల్‌లో జేడీని విమర్శిస్తూ హాస్పిటల్‌లోనే తిరుగుతుంటాడు. కామెడీతో పాటు, సెంటిమెంట్ తో ఈ సీజన్ సాగుతుంది.
Read Also : ప్రమాదంలో పడే ప్రేమ జంట… ఫోటోగ్రాఫర్ కి చెమటలు పట్టించే దెయ్యం… వణుకు పుట్టించే థాయ్ హారర్