Medical Thriller OTT : ఫార్మా కంపెనీల గురించి మనకు తెలిసింది ఒక వైపు మాత్రమే. మరో వైపు ఉండే చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. కంపెనీలు లాభాల కోసం తప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేస్తూ, నాణ్యత లేని మందులను మార్కెట్లోకి తెచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ప్రయాణాల కంటే డబ్బే ముఖ్యం. ఈ ఫార్మా కంపెనీలు మనుషుల మీద చేసే ప్రయోగాలు చూస్తే గుండె జారిపోతుంది. ప్రయోగశాలలో మనుషులు చచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోరు. అలాగే తప్పుడు నివేదికలు ఇచ్చి మందులను ప్రజల మీదకి వదిలేస్తుంటారు. ఈ నేపథ్యంలో భారతీయ ఫార్మా రంగంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో ఒక సిరీస్ ను తీశారు. ఈ సిరీస్ కూడా ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్ ఇది.
ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘పిల్’ (Pill). ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఈ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. రితేష్ దేశ్‌ముఖ్ తన కెరీర్‌లో మొదటిసారి సీరియస్ రోల్ చేశారు. విలన్‌గా చేసిన పవన్ మల్హోత్రా నటన హైలైట్‌గా ఉంటుంది. ఆయన చేసే క్రూరత్వం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 2024 జూలై 12 నుంచి ఈ సిరీస్ జియో హాట్ స్టార్ (Jio hotstar)లో స్ట్రీమింగ్ కి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. దీనిని రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేశారు. ఈయన అంతకుముందు ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘రైడ్’ వంటి హిట్ సినిమాలు తీశారు. అందుకే సిరీస్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ కు ఐయండిబిలో 7.8 రేటింగ్ కూడా ఉంది.
ఒక పెద్ద ఫార్మా కంపెనీ ఓనర్ బ్రహ్మ గిల్, ఎలాగైనా సరే తన కంపెనీ మందులను మార్కెట్లోకి వదిలి కోట్లు సంపాదించాలని స్కెచ్ వేస్తాడు. దాని కోసం క్లినికల్ ట్రయల్స్‌లో తప్పుడు రిపోర్ట్లు క్రియేట్ చేసి, అమాయకపు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటాడు. ఆ కంపెనీకి అడ్డు చెప్పేవాడు లేక, సిస్టమ్‌లో ఉన్న అధికారులందరినీ డబ్బుతో కొనేసి తన దందా సాగిస్తుంటాడు. కట్ చేస్తే.. మెడిసిన్ అథారిటీలో పని చేసే ప్రకాష్ చౌహాన్ (రితేష్ దేశ్‌ముఖ్) అనే ఒక సిన్సియర్ ఆఫీసర్ ఈ దందాను పసిగడతాడు. మందుల టెస్టింగ్‌లో జరుగుతున్న మోసాలను బయటపెట్టాలని డిసైడ్ అవుతాడు.
కానీ అతనికి ఎదురుగా ఉన్నది మామూలు వ్యక్తి కాదు. డబ్బు, అధికారం ఉన్న ఒక పెద్ద మాఫియా. అయినా సరే, భయం లేకుండా తనతో పాటు మరికొంతమందిని కలిపి ఆ ఫార్మా కంపెనీ గుట్టు రట్టు చేయడానికి రంగంలోకి దిగుతాడు. చివరికి ఆ పవర్ ఫుల్ విలన్ మీద ప్రకాష్ ఎలా గెలిచాడు? ప్రాణాలకు తెగించి ఆ నకిలీ మందుల దందాను ఎలా ఆపాడు? అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్. మెడికల్ ఫీల్డ్‌లో జరుగుతున్న దారుణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, చివరి వరకు సస్పెన్స్‌తో సాగుతుంది ఈ కథ.
Read Also : పిచ్చోడు అనుకున్నారు.. కానీ ప్రపంచాన్నే గెలిచాడు… క్లైమాక్స్ వరకు చూపు కూడా తిప్పలేరు