E-Paper
Advertisement

Hydraa: బరితెగించిన కబ్జా కోరులు.. కాలనీ రోడ్లన్నీ మాయం..?

Hydraa: బరితెగించిన కబ్జా కోరులు.. కాలనీ రోడ్లన్నీ మాయం..?
Advertisement

Hydraa: స్వేచ్ఛ బ్యూరో:  కాల‌నీల్లోని రోడ్లను సైతం వదలటం లేదు. అక్రమార్కులు వాటిని కూడాు క‌బ్జా చేసేస్తున్నారు. డెడ్ ఎండ్ కాల‌నీ రోడ్డుంటే, ఇరువైపులా ప్లాట్లున్న‌వారు ఆ దారినే మూసేస్తున్నారు. కొత్త‌గా ప‌క్క‌న లే ఔట్‌లు వేసిన వారు, ఇప్ప‌టికే ఉన్న వ‌ర‌ద‌, మురుగు కాలువ‌ల‌కు ఆటంకాలు సృష్టిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబ‌ర్‌పేట్ మండ‌లం కుంట్లూరు విలేజ్ స‌ర్వే నెంబ‌రు 204లో దాదాపు 15 ఎక‌రాల మేర 800ల ప్లాట్ల‌తో అంజానాద్రిన‌గ‌ర్ పేరిట లే ఔట్ వేశారు. ప‌క్క‌నే లే ఔట్ వేసిన వారు త‌మ లే ఔట్లోకి జ‌రిగి ర‌హ‌దారితో పాటు కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజ‌నాద్రి ప్లాట్ య‌జ‌మానులు ఫిర్యాదు చేశారు.

మ‌హ‌ల‌క్ష్మీన‌గ‌ర్ కాల‌నీ..

తుర్క‌యాంజ‌ల్ నాగార్జున సాగ‌ర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మ‌న్నెగూడ విలేజ్‌లో 30 పీట్ల ర‌హ‌దారిని ఆక్ర‌మించార‌ని, రోడ్డు మీద ట్రాన్స్‌ఫార్మ‌ర్‌, గుడికి చెందిన ప్ర‌హ‌రీ నిర్మించార‌ని ప్ర‌జావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ ప్లాట్ల‌కు ఎల్ ఆర్ ఎస్ కూడా వ‌చ్చింద‌ని, అందులో రోడ్డు కూడా ఉంద‌ని, ఇప్పుడు కావాలంటే రోడ్డును కొనుక్కోవాల‌ని అక్క‌డివారు చెబుతున్నార‌ని ఫిర్యాదులో తెలిపారు. హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం వ‌న‌స్థ‌లి పురం సాహేబ్‌న‌గ‌ర్ క‌లాన్‌లోని మ‌హ‌ల‌క్ష్మీన‌గ‌ర్ కాల‌నీ ప‌క్క‌న క‌మ‌ర్షియ‌ల్ లేఔట్ వేసిన వారు మురుగుతో పాటు వ‌ర‌ద కాలువను మూసేయ‌డంతో త‌మ ప్రాంతం నీట మునుగుతోంద‌ని ఫిర్యాదు చేశారు.

Advertisement

Also Read: సర్కారు బడికి కార్పొరేట్ కష్టాలు.. నిబంధన ఉచ్చులో 11 స్కూళ్లు..!

సెంట్ర‌ల్ పార్కులో..

ప‌టాన్‌చెరులోని జీఎంఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ప‌క్క‌న ప్ర‌వీన్స్ ల‌గ్జారియాలో సెంట్ర‌ల్ పార్కులో ఆల‌యాల పేరిట క‌బ్జా చేస్తున్నార‌ని, వెంట‌నే నిలువ‌రించాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో వాపోయారు. నాచారం- మల్లాపూర్ ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని, రోడ్డు మీద‌కు వ‌చ్చి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని, రాజేంద్ర‌న‌గ‌ర్ జోన్ అత్తాపూర్ స‌ర్కిల్‌, మైలార్‌దేవుప‌ల్లిలోని టీఎన్‌జీవో కాల‌నీలో 1200 గ‌జాల పార్కును క‌బ్జా చేశార‌ని ఫిర్యాదులందాయి. ఇదే కాల‌నీలో 40 ఫీట్ల ర‌హ‌దారిని కూడా క‌బ్జా చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామంలో ప‌త్తికుంట‌కు వెళ్లే వ‌ర‌ద కాలువ‌ను క‌బ్జా చేస్తున్నార‌ని వచ్చిన ఫిర్యాదుతో పాటు హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 58 ఫిర్యాదులందినట్లు, వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించి సత్వర ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

Advertisement

Also Read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. టూరిజంలో పారదర్శకత పెంపునకు కృషి!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×