BigTV English

OTT Movie : రూరల్ టౌన్ లో బ్రూటల్ మర్డర్స్… వేరే లెవెల్ ట్విస్టులు, టర్నులు… చిప్పులు ఎగిరిపోవడం ఖాయం

OTT Movie : రూరల్ టౌన్ లో బ్రూటల్ మర్డర్స్… వేరే లెవెల్ ట్విస్టులు, టర్నులు… చిప్పులు ఎగిరిపోవడం ఖాయం

OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా వస్తున్న సినిమాలు, సిరీస్ లు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. అందులోనూ సీరియల్ మర్డర్ కేస్ ఆధారంగా తీసిన సినిమాలు, మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. కొరియాలో 1986-1991 మధ్య జరిగిన నిజమైన హత్యల ఆధారంగా, ఒక థ్రిల్లర్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా, పోలీసు ఇన్వెస్టిగేషన్ లో అదిరిపోయే ట్విస్టులను ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘మెమరీస్ ఆఫ్ మర్డర్’ (Memories of murders) ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా. దీనికి బాంగ్ జూన్-హో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాంగ్ కాంగ్-హో, కిమ్ సాంగ్-క్యుంగ్, కిమ్ రోవ్-హా, కిమ్ రోవ్-హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2003 మే 2న కొరియాలో రిలీజ్ అయింది. ఈ సినిమా IMDbలో 8.1/10 రేటింగ్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది 2003 గ్రాండ్ బెల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్స్ అవార్డ్ లను గెలుచుకుంది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ నలభై సంవత్సరాల క్రితం, కొరియాలోని ఒక చిన్న ఊరిలో మొదలవుతుంది. ప్రశాంతంగా ఉన్న ఈ ఊరిలో ఒక యువతిపై దారుణంగా అఘాయిత్యం చేసి, చంపి ఒక పొలంలో విసిరేస్తారు. ఈ కేస్‌ను పార్క్ అనే పోలీసు ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. పార్క్ ఇలాంటి పెద్ద కేసులను ఎప్పుడూ డీల్ చేయలేదు. ఈ కేసులో క్లూస్ కోసం నానా తంటాలు పడతాడు. ఈ కేసు ఏ మాత్రం ముందుకు కదలదు. ఇంతలో అక్కడ మరో అమ్మాయి మర్డర్ జరుగుతుంది. అది మొదటి మర్డర్ జరిగినట్టే ఉంటుంది. ఇది సీరియల్ కిల్లర్ పని అని తెలుస్తుంది.


Read Also : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

ఈ సమయంలో సిటీ నుంచి సెఓ అనే పోలీసు ఆఫీసర్ వస్తాడు. అతనికి సైంటిఫిక్ మెథడ్స్ తో కేసులను త్వరగా సాల్వ్ చేసే అనుభవం ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ హత్యలు వర్షం కూరుస్తున్న సమయంలోనే, అదికూడా రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్ అవుతున్నారని తెలుస్తుంది. కొన్ని క్లూస్ దొరికినా, అవి కిల్లర్ వరకూ చేరే విధంగా ఉండవు. ఇక సినిమా ఊహించని ట్విస్టులతో మైండ్ ని బెండ్ చేస్తుంది. చివరికి కిల్లర్ ని పోలీసులు పట్టుకుంటారా ? కిల్లర్ ఎందుకు రెడ్ డ్రెస్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నాడు. అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

OTT Movie : మూడేళ్ళ తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘కాంతారా’ మూవీ… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

OTT Movie : అర్ధరాత్రి ఇంటికొచ్చే మాస్క్ మ్యాన్… క్షణక్షణం భయపెట్టే సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్

Kurukshetra on OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘కురుక్షేత్ర’… ‘మహావతార్ నరసింహా’లాంటి విజువల్ వండర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Param Sundari on OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ 100 కోట్ల రొమాంటిక్ మూవీ… చూడాలంటే కళ్ళు బైర్లుకమ్మే కండిషన్స్

Big Stories

×