Akhanda2 Thaandavam : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. తమన్ విషయానికి వస్తే అరవింద సమేత వీర రాఘవ సినిమా కి ముందు ఆ సినిమా తర్వాత అని చెప్పాలి. తమన్ కెరియర్ లో 100 సినిమా అది. ఆ సినిమా తర్వాత తమన్ మ్యూజిక్ చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ సంగీత దర్శకుడుగా తమన్ ఫెయిల్ కాలేదు.
త్రివిక్రమ్ పరిచయం అయిన తర్వాత తమన్ చాలా పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఇదంతా కూడా కేవలం త్రివిక్రమ్ వలనే సాధ్యమైంది.
తమన్ మ్యూజిక్ చేసిన అఖండ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ అంటేనే ఒక హైప్ ఉంటుంది. దానిని తమన్ తన మ్యూజిక్ తో మరింత రెట్టింపు చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కూడా తమన్న సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఇద్దరు పండితులను తమన్ తీసుకుని వచ్చాడు. శ్రావణ్ మిశ్రా అతుల్ మిశ్రా అనబడే వీళ్ళిద్దరిని అఖండ టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ వాడారు. వీరిద్దరితో శ్లోకాలు పాడించి దానితో బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేశాడు తమన్. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియో చూసిన చాలామంది థియేటర్ లో శివతాండవం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#Akhanda2
Pandit Duo Shravan Misra and atul Misra వస్తే ఇలా ఉంటుంది. #Thaman మంచి ఎంపిక 👌 https://t.co/ZJmzROd6Sd pic.twitter.com/UgkUe5RhRV— BIG TV Cinema (@BigtvCinema) October 12, 2025
ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఖచ్చితంగా చెప్పిన డేట్ కు సినిమా విడుదల కానుంది.
వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. అని దీనికి సంబంధించి కొంత మేరకు విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉండటం వలన దీనిని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చాయి. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. అలానే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా మంచి సక్సెస్ అయింది.
Also Read: Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను