E-Paper
Advertisement

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో నష్టం!

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో నష్టం!
Advertisement

Fire Accident: కృష్ణాజిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూ చౌక్ సెంటర్‌లోని వస్త్ర దుకాణాల సముదాయంలో భారీగా మంటలు చెలరేగాయి. మొదట సెల్ ఫోన్ షాప్‌లో చెలరేగిన మంటలు.. క్రమంగా మిగతా షాపులకు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే కాంప్లెక్స్‌లో జూనియర్ కళాశాల, ఎస్‌బీఐ శాఖలు కూడా ఉన్నాయి. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ఈ ఘటనలో రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.  దుకాణంలో వస్త్రాలు, షోరూమ్‌లలో ఉన్న ఖరీదైన దుస్తులు, అల్మారాలు, క్యాష్ కౌంటర్లు అన్నీ కాలిపోయినట్లు తెలుస్తోంది. వ్యాపారులు తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కన్నీటిపర్యంతమవుతూ తమ జీవనాధారం ఒక్కసారిగా నాశనం అయిందని వాపోయారు.

Advertisement

Also Read: మామ బీమా డబ్బులు కోసం అల్లుడి మర్డర్ ప్లాన్.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ

అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే అసలు కారణం వెల్లడిస్తామని తెలిపారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×