E-Paper
Advertisement

మాదాపూర్‌లో హైడ్రా సంచలన ఆపరేషన్.. ఇళ్ల బెడ్‌రూమ్‌, కిచెన్‌లలో వేసిన బోర్లు బట్టబయలు!

మాదాపూర్‌లో హైడ్రా సంచలన ఆపరేషన్.. ఇళ్ల బెడ్‌రూమ్‌, కిచెన్‌లలో వేసిన బోర్లు బట్టబయలు!
Advertisement

HYDRAA Operation: హైడ్రా మాదాపూర్ సమీపంలో అభివృద్ది సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో శ‌నివారం మరో భారీ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించింది. సున్నం చెరువు చెంత అక్రమ బోర్లపై హైడ్రా స్టింగ్ ఆపరేషన్ చేసి అక్ర‌మ నీటి దందాకు చెక్ పెట్టింది. ఇళ్ల‌లో, బెడ్ రూమ్ లలో, కిచెన్ లలో భారీ స్థాయిలో బోర్లు వేసి, హైప‌వ‌ర్ మోటార్ల ద్వారా తోడిన నీటిని భూగ‌ర్భంలో వంద‌ల‌మీట‌ర్ల పైపులు అమ‌ర్చి, త‌ర‌లించే వైనాన్నిబ‌ట్ట‌బ‌య‌లు చేసింది.

హైడ్రా ఎట్ట‌కేల‌కు చెక్..

ఎక్క‌డో బోరుంటుంది. మ‌రెక్క‌డో ట్యాంక్ ఉంటుంది. అలా తోడిని నీటిని భారీ వాట‌ర్‌ ట్యాంక‌ర్ల ద్వారా తీసుకువ‌చ్చి చిన్న ట్యాంక‌ర్ల‌ను నింపి, అమ్ముకునే వ్యవహరాన్ని బ‌య‌ట పెట్టింది. వెంట‌నే రంగంలోకి దిగి సున్నం చెరువు చెంత నీటి దందాకు చెక్ పెట్టింది. సీఎంసీ, రెవెన్యూ, జ‌ల‌మండ‌లి అధికారుల‌తో క‌లిసి హైడ్రా సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించింది. ఇళ్ల‌లో బోర్లు వేసి, గుట్టు చ‌ప్పుడు కాకుండా ద‌శాబ్దాలుగా సాగుతున్న అక్ర‌మ నీటి వ్యాపారానికి హైడ్రా ఎట్ట‌కేల‌కు చెక్ పెట్టింది. అక్ర‌మంగా వేసిన బోర్ల‌ను ప‌దుల సంఖ్య‌లో తొల‌గించింది. శ‌నివారం మ‌ధ్యాహ్నానికి మొత్తం 15 బోర్ల‌ను తొల‌గించింది. ప‌రోక్షంగా ప‌దుల సంఖ్య‌లో బోర్ల‌ను అనుసంధానం చేసే భూగ‌ర్భ పైపుల‌ను తొల‌గించింది. ఈ సెర్చ్ ఆప‌రేష‌న్‌ను కొన‌సాగించాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది.

అక్ర‌మ నీటి దందాతో సున్నం చెరువును ఖాళీ..

Advertisement

సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోనే ప‌దుల సంఖ్య‌లో బోర్లు వేసి, దుర్గంధ భ‌రిత నీటి దందాకు హైడ్రా గ‌తంలోనే చెక్ పెట్టింది. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ద్వారా అక్క‌డి బోరు నీటిని ప‌రీక్షించి ప్ర‌మాద‌క‌ర‌, ప్రాణాంత‌క ర‌సాయ‌నాలున్నాయ‌ని తేల్చి చెప్పింది. కాడ్మియం, సీసం, నికెల్ వంటి లోహాలు అధికంగా ఉన్నాయ‌ని రుజువు చేసింది. ఈ నీళ్లు తాగితే కాలేయ స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర రోగాలతో పాటు గ‌ర్భ‌స్తవాలు జ‌రుగుతాయని హెచ్చరించింది. ఇలాంటి నీళ్ల‌ను మాధాపూర్‌లోని హాస్ట‌ళ్ల‌కు, హోట‌ళ్ల‌కు స‌ర‌ఫ‌రా చేసి సొమ్ము చేసుకునే వారికి హైడ్రా చెక్ పెట్టింది.

హైడ్రాకు ఫిర్యాదులు..

శ‌నివారం న‌వ‌భార‌త్‌న‌గ‌ర్‌, బోర‌బండ్ ఫేజ్-3 ప్రాంతాల్లో ఉన్న బోర్ల‌ను తొల‌గించింది. సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తున్న క్ర‌మంలో అందులోని 10 అడుగుల మేర పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గించింది. దీంతో చెరువులో నీరు భూగ‌ర్భంలోకి ఇంక‌డం మొద‌ల‌య్యింది. భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. అయితే ఈ ఫ‌లాలు అక్క‌డి నివాసితుల‌కు ద‌క్క‌కుండా, కొందరు అక్రమార్కులు నీటి వ్యాపారం చేస్తున్నట్లు హైడ్రాకు ఫిర్యాదులు కూడా అందినట్లు వెల్లడించింది. ప‌దుల సంఖ్య‌లో నీటి ట్యాంక‌ర్లు త‌ర‌లించి నీటిని తోడేస్తున్నార‌నే ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా ఈ రకమైన చర్యలను తీసుకుంది.

Advertisement

Also read: ప్రేమ పేరుతో 20 మంది లేడీ కానిస్టేబుళ్లను పడేసిన కేటుగాడు.. కానీ చివరికి..?

అనుమానం రాకుండా బెడ్ రూమ్ లలో బోర్లు..

సున్నం చెరువు చెంత నివాసాల‌లో ఆశ్చ‌ర్యం క‌లిగించేలా హైడ్రా బోర్లను గుర్తించింది. ముఖ్యంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా బెడ్ రూమ్ లలో కూడా అక్రమంగా బోర్లు వేసి, నీటిని తోడేస్తున్నట్లు కనిపెట్టింది. నిద్ర‌పోయే బెడ్ల కింద, వంట చేసుకుని కిచెన్ లలో బోర్లును గుర్తించింది. నీటి సంపులో కూడా భారీ బోర్లున్నట్లు గుర్తించింది. ఇలా నీటి దందా కొన‌సాగిన తీరు క‌నిపించింది. స్థానికుల ముందే వాటిని తొల‌గించింది. బోర్ల‌కు బిగించిన మోటార్ల‌తో స‌హా తొల‌గించి నీటి దందాకు చెక్ పెట్టింది. శ‌నివారం ఉద‌యం ఆరునన్నర గంటలకు ప్రారంభించిన ఈ భారీ ఆప‌రేష‌న్‌ను శ‌నివారం సాయంత్రం వ‌ర‌కూ కొన‌సాగింది.

అక్ర‌మ‌ నీటి దందా..

ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ గ‌తంలో 60 అడుగుల్లో నీల్లు ప‌డేవవని, ఇప్పుడు 600 అడుగుల వరకు బోర్లు వేసినా, నీరు ప‌డ‌ట్లేద‌ని వాపోయారు. బోర్లు ఎండిపోయి, మోటార్లు కాలిపోవ‌డంతో నీళ్ల‌ను కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. సున్నం చెరువులో నీటి నిల్వ‌ల‌పైనా అక్ర‌మ‌ నీటి దందా ప్ర‌భావం ప‌డుతోంద‌ని వాపోయారు. వ‌ర్షాకాలం ఆదిలో ప‌డిన వ‌ర్షంతో కొంత‌ మొత్తంలో చేరిన నీటిని కూడా ప‌రిస‌రాల్లో వేసిన భారీ బోర్లు గుంజేశాయ‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప‌దుల సంఖ్య‌లో ట్యాంక‌ర్ల‌ను నింపే కార్య‌క్ర‌మాలు చేయ‌డంతో త‌మ‌కు దారిలేకుండా చేస్తున్నార‌ని ప‌లువురు వాపోయారు. ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు ప‌డ‌క తాగు నీటి క‌ష్టాలు రాక‌ముందే హైడ్రా ఇలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టడం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

2.20 ఎక‌రాల పార్కుల‌ను కాపాడిన హైడ్రా..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మియాపూర్ గ్రామం ప్ర‌శాంత్‌న‌గ‌ర్ కాల‌నీలో 2.20 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న పార్కుల‌ను హైడ్రా శనివారం కాపాడింది. 45 ఎక‌రాలు, 30 ఎక‌రాల ప‌రిధిలో రెండు ద‌శ‌ల్లో వేసిన లే ఔట్‌లలో మొత్తం 10 పార్కులుగా కేటాయించారు. హెచ్ఎండీఏ అనుమ‌తి పొందిన లే ఔట్ల‌లో 4 పార్కులు అన్యాక్రాంతమయ్యాయి. ఒక పార్కును జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. మిగ‌తా పార్కుల‌ను కూడా క‌బ్జా చేసేందుకు చిన్న గదుల‌ను నిర్మించారు. ఇదే విష‌య‌మై ప్రశాంత్‌న‌గ‌ర్ కాల‌నీ నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కింగ్ కోసం వినియోగించుకుంటూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారుల‌తో హైడ్రా క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి క‌బ్జాల‌ను నిర్ధారించుకుంది. వెంట‌నే 2.20 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న పార్కుల‌ను కాపాడుతూ చ‌ర్య‌లు తీసుకుంది. షెడ్డుల‌ను తొల‌గించింది. పార్కు స్థ‌లంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. కాపాడిన పార్కుల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ కూడా వేసింది.

Also read: 2017 నుండి గంజాయి అమ్ముతున్న వృద్ధురాలు అరెస్ట్!

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. ఆ పరీక్షను వాయిదా వేయండి?

ఐపీఎస్ పేరుతో ఘరానా మోసాలు.. ఎలా ప‌ట్టుబ‌డ్డాడంటే..

2017 నుండి గంజాయి అమ్ముతున్న వృద్ధురాలు అరెస్ట్!

విజయవాడ ట్రిప్‌లో విషాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరు యువకులు మృతి!

నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి.. నీళ్లు ఎట్లా రావో చూస్తా: జగదీశ్వర్ రెడ్డి!

కాంగ్రెస్‌లో కుర్చీ లాటరీ.. జెండా మోసినోళ్లకు హ్యాండ్.. జంప్ జిలానీలకే హవా!

జోగులాంబ గద్వాల జిల్లాలో.. దొంగ మస్తర్లతో ఉపాధి హామీ నిధుల గోల్‌మాల్?

Big Stories

Advertisement
×