E-Paper
Advertisement

బెర్లిన్ లో బురిడీ కొట్టించే గ్యాంగ్… మనీ హీస్ట్ లాంటి మైండ్ బెండింగ్ సిరీస్

బెర్లిన్ లో బురిడీ కొట్టించే గ్యాంగ్… మనీ హీస్ట్ లాంటి మైండ్ బెండింగ్ సిరీస్
Advertisement

Heist Thriller OTT: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే పడి చచ్చే ఆడియన్స్ ఎంతోమంది ఉంటారు. కానీ హీస్ట్ థ్రిల్లర్ అంటే ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ప్రేక్షకులకు ఇష్టమైన జానర్. నిజానికి ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు చాలా అరుదుగా మూవీ లవర్స్ ను మెప్పిస్తాయి. తాజాగా ఆ లిస్ట్ లో చెరిపోయింది ఓ స్పానిష్ హీస్ట్ థ్రిల్లర్. మరి ఆ సిరీస్ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు Berlin and the Lady with an Ermine (2026). ‘మనీ హైస్ట్’ (Money Heist) యూనివర్స్ నుండి వచ్చిన ‘బెర్లిన్’ స్పిన్-ఆఫ్ సిరీస్ సీజన్ 2. 2026 మే 15న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన 8 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. స్పెయిన్‌లోని సెవిల్లే నగరం నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ ప్రస్తుతం Netflix లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు ఇతర భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ పారిస్ నేపథ్యంలో ఉంటే, ఈ రెండో సీజన్ మాత్రం స్పెయిన్ అందాలు, రిచ్ లొకేషన్స్, పెడ్రో అలోన్సో స్టైలిష్ యాక్టింగ్‌ తో అదిరిపోయింది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సీజన్‌ లో మాస్టర్ మైండ్ బెర్లిన్ (పెడ్రో అలోన్సో). ఇతనే మన హీరో. తన పాత ముఠా సభ్యులైన డామియాన్, కెయిలా, రోయ్, కామెరాన్, బ్రూస్‌లను మళ్లీ కలుపుతాడు. సెవిల్లే నగరానికి వీళ్ళని పిలిపించి, లియోనార్డో డా విన్సీ గీసిన అత్యంత విలువైన పెయింటింగ్ “ది లేడీ విత్ యాన్ ఎర్మైన్” (Lady with an Ermine) ను దొంగిలిద్దాం అని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ పెయింటింగ్‌ ను దొంగిలించమని బెర్లిన్‌ ను డ్యూక్ (Alvaro) అనే కోటీశ్వరుడు, అతని భార్య బ్లాక్‌మెయిల్ చేస్తారు. తనను పావులా వాడుకుంటున్న డ్యూక్‌పై రివేంజ్ ప్లాన్ చేస్తాడు బెర్లిన్. అనుకునట్టుగానే అతను ఒకే సమయంలో రెండు దొంగతనాలు ప్లాన్ చేస్తాడు.

Also Read : గర్భిణీలను మాత్రమే చంపుతున్న సైకో కిల్లర్… ఆరు నెలల తరువాత ఓటీటీలోకి… ట్రెండింగ్ లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

Advertisement

అందులో మొదటిది ఆ పెయింటింగ్‌ ను దొంగిలించినట్లు డ్రామా ఆడటం. రెండోది డ్యూక్ భవనం కింద రహస్యంగా ఉన్న అండర్‌గ్రౌండ్ వాల్ట్ లోని సంపదను కొల్లగొట్టడం వీళ్ళ ప్లాన్ లో భాగం. ఓవైపు వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తుంటే డ్యూక్ బెర్లిన్ టీమ్ ప్రతి కదలికను గమనిస్తున్నాడని తెలుస్తుంది. కానీ మరోవైపు బెర్లిన్ తన సైకలాజికల్ ప్లానింగ్‌ తో డ్యూక్‌ కు అంతా తన కంట్రోల్‌లోనే ఉన్నటు భ్రమింపజేస్తాడు. బెర్లిన్ ఈ ప్రయాణంలో కాండేలా (ఇన్మా క్యుయెస్టా) అనే ఒక ఫైరీ స్పానిష్ మహిళను ప్రేమిస్తాడు. మరి ఇంతకీ అతను ఆ దొంగతనం అనుకున్నట్టుగా చేశాడా ? మరి బెర్లిన్ లవ్ చివరికి ఏమైంది ? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×