E-Paper
Advertisement

ప్రతీ సీన్ లోనూ ఒక సీక్రెట్… వీకెండ్ కోసమే ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్లు

ప్రతీ సీన్ లోనూ ఒక సీక్రెట్… వీకెండ్ కోసమే ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్లు
Advertisement

Psychological Thrillers OTT : చివరి నిమిషం వరకు ఆలోచింపజేసే, మెదడుకు పదును పెట్టే, ఊహించని ట్విస్టులున్న సినిమాలంటే మీకు ఇష్టమా ? అయితే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ లు మీ కోసమే. ఈ సినిమాలలో ఉండే కథ, ఉత్కంఠ, కథలోని మలుపులు ఆడియన్స్ ను తెరకే అతుక్కుపోయేలా చేస్తాయి. మరి ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏంటి? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

ఎనిమీ (enemy) – నెట్‌ఫ్లిక్స్

ఒక కాలేజీ ప్రొఫెసర్ సినిమాలో తన పోలికలు ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడితో ఆగకుండా తనలాంటి ఆ వ్యక్తి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ పనే అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను చాలా కాలం పాటు ఆలోచింపజేసేలా ఉంటుంది.

Advertisement

Also Read : పదేళ్ల క్రితం క్లోజ్ అయిన హత్య కేసు రీఓపెన్… లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అల్టిమేట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్

నైట్‌క్రాలర్ (nightcrawler)- నెట్‌ఫ్లిక్స్

ఒక చిన్న దొంగ క్రైమ్ జర్నలిజం ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటాడు. సంచలనాత్మక వార్తలను అమ్మి విజయం సాధించాలనేది అతని ఆశయం. కానీ ఆ పని చేయడం స్టార్ట్ చేసిన కొంత కాలానికే అతను వార్తలకు, నేరానికి మధ్య ఉన్న హద్దులను చెరిపేస్తాడు. ఈ చిత్రంలో మీడియా చీకటి ప్రపంచం ఎలా ఉంటుందో క్లియర్ గా చూడవచ్చు.

నోక్టర్నల్ యానిమల్స్ (nocturnal animals)- నెట్‌ఫ్లిక్స్

Advertisement

ఆర్ట్ గ్యాలరీ యజమానురాలు తన మాజీ భర్త రాసిన నవలను చదువుతుంది. దానిలోని కథ వారి గత రిలేషన్ లోని బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తుకు తేవడంతో ఏం జరుగుతుంది? అన్నది కథ. ఈ చిత్రం భావోద్వేగభరితమైన డ్రామా, థ్రిల్లర్‌ ల అద్భుతమైన మిశ్రమంలా ఉంటుంది.

ప్రిడెస్టినేషన్ (predestination) – అమెజాన్ ప్రైమ్ వీడియో

చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన బాంబర్ “ఫిజిల్ బాంబర్”. అతన్ని అడ్డుకోవడానికి ప్రయాణించే ఒక ఏజెంట్ కథే ఈ సినిమా. కానీ కథ సాగేకొద్దీ ఒక్కొక్కటిగా వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. సైకలాజికల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు.

Also Read : ప్రతిరోజూ దెయ్యాల టైమ్‌లో నిద్రలేచే అమ్మాయి… మూడు సీజన్ల పాటు ఫుల్ థ్రిల్ ఇచ్చే హర్రర్ స్టోరీ

ది ఇన్విజిబుల్ గెస్ట్ (the invisible guest)- నెట్‌ఫ్లిక్స్

ప్రియురాలి హత్య కేసులో చిక్కుకున్న వ్యాపారవేత్త స్టోరీ ఇది. తనను తాను రక్షించుకోవడానికి అతను ఒక పాపులర్ న్యాయవాది సహాయం తీసుకుంటాడు. కానీ నిజం బయటపడే కొద్దీ, కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. మరి ఆ వ్యాపారవేత్త ఈ కేసు నుంచి ఎలా బయట పడ్డాడు అన్నది తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×