E-Paper
Advertisement

‘పంచాయత్ 5’ కోసం వెయిటింగా ? ఆలోగా చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్ లు ఇవే

‘పంచాయత్ 5’ కోసం వెయిటింగా ? ఆలోగా చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్ లు ఇవే
Advertisement

Family Web Series OTT : కొన్ని సిరీస్ లు సింపుల్ గా ఉన్నా కూడా తేలికపాటి హాస్యంతో ఆడియన్స్ హృదయాల్లో ఒక స్పెషల్ స్థానాన్ని సంపాదించుకుంటాయి. ఈ విషయంలో “పంచాయత్” ఒక విశిష్టతను సాధించింది అని చెప్పాలి. గ్రామీణ దృశ్యాలు, విలక్షణమైన పాత్రలు, భావోద్వేగభరితమైన కథతో ఈ సిరీస్ ఎంతోమంది ఆడియన్స్ కు ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు ఆ సిరీస్ ఫ్యాన్స్ నెక్స్ట్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీజన్ 5 రిలీజ్ కి ఇంకా చాలా కాలం ఉంది. ఇలాంటి తరుణంలో అదే విధమైన హాయిని, వినోదాన్ని అందించే మరికొన్ని వెబ్ సిరీస్‌ లను చూసేద్దాం పదండి.

Gram Chikitsalay – అమెజాన్ ప్రైమ్ వీడియో

ఉత్తర భారతదేశంలోని భట్కండి అనే మారుమూల గ్రామంలో కథ నడుస్తుంది. డాక్టర్ ప్రభాత్ సిన్హా (అమోల్ పరాశర్) చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మూసేసి ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని తిరిగి ప్రారంభించడానికి అతను పోరాడాల్సి వస్తుంది. స్థానిక సిబ్బంది కొరత, ప్రాథమిక వైద్య సౌకర్యాల లేమి అతనికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడతాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో డాక్టర్ ప్రభాత్ పడే కష్టాలను, గ్రామస్తుల మద్దతు పొందడానికి అతను చేసే ప్రయత్నాలను ఆసక్తికరంగా చూపించారు.

Dupahiya – అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

‘పంచాయత్’ లాగే ‘Dupahiya’ కూడా చిన్న పట్టణ, గ్రామాల్లోని అనుబంధాన్ని, హాస్యాన్ని, ప్రత్యేక స్ఫూర్తిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ కథ ‘ధడక్‌పూర్’ అనే గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామం 25 ఏళ్లుగా నేరరహితం ఊరిగా నిలుస్తుంది. కానీ ఒక పెళ్ళికి కొద్ది రోజుల ముందు ఒక మోటార్‌ సైకిల్ దొంగతనంతో గ్రామంలోని ప్రశాంతత ఒక్కసారిగా భగ్నమవుతుంది. గ్రామం పరువు ప్రమాదంలో పడటంతో, గ్రామస్తులు తమ విభేదాలను పక్కన పెడతారు. మిస్సైన ఆ మోటార్‌ సైకిల్‌ ను కనుగొనేందుకు వాళ్ళు చేసే సాహసయాత్ర ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయిస్తుంది.

Tripling – Zee 5

కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను చాటిచెప్పే సిరీస్ ఇది. చాలా కాలం తర్వాత అనుకోకుండా కలుసుకున్న చందన్, చంచల్, చిత్వన్ (సుమిత్ వ్యాస్, మాన్వి గాగ్రూ, అమోల్ పరాశర్) అనే ముగ్గురు తోబుట్టువుల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ తర్వాత ఈ ముగ్గురూ సరదా రోడ్ ట్రిప్‌ ను స్టార్ట్ చేస్తారు. ఈ ప్రయాణంలో వాళ్ళు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు ? అన్నది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

Advertisement

Also Read : రివేంజ్ నుంచి ఇంటెన్స్ థ్రిల్లర్ల వరకు… ఈ వీకెండ్ కు బెస్ట్ హిందీ మూవీస్ ఇవే

Gullak – సోనీలివ్

ఇదొక హార్ట్ టచింగ్ సిరీస్. ‘గుల్లక్’ మిశ్రా కుటుంబం చిన్న చిన్న కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, గాఢమైన ప్రేమ వంటి అంశాలతో నడుస్తుంది. ఈ సిరీస్ అత్యంత సాధారణ క్షణాలలో కూడా నవ్వును, భావోద్వేగాన్ని పండిస్తుంది. దీనిలోని పాతకాలపు నేపథ్యం, ​​ఇంటి వాతావరణం, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇదొక స్పెషల్ సిరీస్ గా నిలుస్తుంది.

కోటా ఫ్యాక్టరీ (Kota Factory) – నెట్‌ఫ్లిక్స్

‘పంచాయత్’ లాగే, ‘కోటా ఫ్యాక్టరీ’ కూడా దాని లోతైన, భావోద్వేగభరితమైన కథకు ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లోని కోటా నగర నేపథ్యంలో సాగే ఈ సిరీస్, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అక్కడికి వచ్చే విద్యార్థుల జీవితాలను అనుసరిస్తుంది. చదువుల తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య వారి స్నేహాలు, పెద్ద కలలు, పోటీలు, వ్యక్తిగత పోరాటాలను ఎంతో హృద్యంగా, సహజంగా చిత్రీకరించారు, ఇది ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×