E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిల శవాలను తవ్వి తీసి ఆ పాడు పని… ఒళ్ళు జలదరించే సీన్లు… ఒంటరిగా చూస్తే ఫసక్

OTT Movie : అమ్మాయిల శవాలను తవ్వి తీసి ఆ పాడు పని… ఒళ్ళు జలదరించే సీన్లు… ఒంటరిగా చూస్తే ఫసక్
Advertisement

OTT Movie : కొన్ని స్టోరీలు దశాబ్ధాలు దాటినా వాటి గురించి కథలు కథలు గా చెప్పుకుంటూ ఉంటారు. 1950ల కాలం నాటి ఒక సైకో ని ఉదాహరణగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అతను చేసే హత్యలు, సమాధులలో తవ్వి తీసే శవాలతో ఒళ్ళు జలదరించే పనులను చూసి అప్పటి అధికారులతో పాటు ప్రజలు కూడా వణికి పోయారు. అతని క్రైమ్స్ హాలీవుడ్ హారర్ మూవీలకు (Psycho, The Texas Chain Saw Massacre) ఇన్‌స్పిరేషన్ అయ్యాయి. అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగిన ఎడ్ గీన్ అనే ఈ సీరియల్ కిల్లర్ జీవిత చరిత్ర ఆధారంగా రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఇది టాప్ టెన్ లో కూడా ట్రెండ్ అవుతోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘మాంస్టర్: ది ఎడ్ గీన్’ (Monster : The ed gein) 2025లో విడుదలైన ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ క్రైమ్ వెబ్ సిరీస్. ఇది “మాంస్టర్” యాంథాలజీ సిరీస్‌లో మూడో సీజన్. ఐయాన్ బ్రెన్నన్ దీనిని రూపొందించారు. ఇందులో చార్లీ హన్నమ్ సైకో పాత్రలో నటించాడు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా 2025 అక్టోబర్ 3 నుంచి 8 ఎపిసోడ్లతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబిలో దీనికి 6.2/10 రేటింగ్ ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1950ల కాలం నాటి ఒక ఊరిలో ఈ కథ మొదలవుతుంది. ఒక ఫామ్‌ హౌస్‌లో ఎడ్ గీన్ అనే సైలెంట్ వ్యక్తి ఉంటాడు. ఆమె తల్లి బయట ప్రపంచానికి దూరంగా ఉంచుతూ పెంచుతుంది. మూఢ నమ్మకాలతో భయాలు పెట్టి, అతని మనసును పూర్తిగా మార్చేస్తుంది. తండ్రి చనిపోయిన తర్వాత అమ్మనే దేవుడిలా ఆరాధిస్తాడు. కానీ 1954లో అమ్మ కూడా చనిపోగానే ఎడ్ పూర్తిగా మారిపోతాడు. మనుషులను హత్య చేయడమే కాకుండా, స్థానిక శ్మశానవాటికల నుండి మహిళల శవాలను దొంగిలించి, వాటి శరీర భాగాలతో వింత వస్తువులను (మాస్క్‌లు, బెల్టులు, దుస్తులు తయారుచేసేవాడు. అతను తన అమ్మలా మారిపోవాలని పిచ్చిగా ప్రయత్నిస్తాడు. ఇంట్లో గోడలు మీద మనుషుల అవయవాలు వేలాడుతూ, ఫ్రిజ్‌లో తలలు పెట్టుకుని ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. ఈ సీన్స్ చాలా డిస్టర్బింగ్‌గా ఉంటాయి.

Read Also : మొగుడు ఉండగానే పనోడితో రాసలీలలు… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

1957లో స్థానిక మహిళ అదృశ్యం కేసులో పోలీసులు అతని ఇంటిని సోదా చేసినప్పుడు, ఈ భయంకరమైన నిజాలు బయట పడతాయి. అక్కడ ఆమె శరీరం గొంతు కోసినట్టు వేలాడుతూ దొరుకుతుంది. ఆ ఇంట్లో శవాలను చూసి పోలీసులు కూడా భయపడిపోతారు. ఎడ్ అరెస్ట్ అవుతాడు. కానీ అతను తన అమ్మని మళ్లీ తిరిగి తెచ్చుకోవాలనే ఇలా చేశానని చెబుతాడు. ఈ సిరీస్ ఎడ్ క్రైమ్స్ ఎలా అల్ఫ్రెడ్ హిచ్‌కాక్ “సైకో”, టోబీ హూపర్ “టెక్సాస్ చైన్‌సా మాసకర్” వంటి హారర్ మూవీలకు ఇన్‌స్పిరేషన్ అయ్యాయో చూపిస్తూ, చివరికి మనం ఈ మాన్స్టర్స్‌ని సెలబ్రిటీలుగా మార్చి ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తున్నామా? అని ప్రశ్నిస్తూ ముగుస్తుంది. ఇక ఎడ్ జీవితాంతం మెంటల్ హాస్పిటల్‌లోనే గడిపి 1984లో చనిపోతాడు. కానీ అతని హారర్ మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది.
Advertisement

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×