E-Paper
Advertisement

ఒకే ఓటీటీలో రెండు మలయాళం సిరీస్ లు… ఇంకా చూడలేదా ?

ఒకే ఓటీటీలో రెండు మలయాళం సిరీస్ లు… ఇంకా చూడలేదా ?
Advertisement

Malayalam Web Series: మలయాళం మూవీ మేకర్స్ కి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అందుకే కేరళ సినిమా ప్రపంచం ఎప్పుడూ కొత్త కొత్త కథలతో మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ వారం ఓటీటీలో ఏకంగా రెండు ఇంట్రెస్టింగ్ మలయాళ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి భయంకరమైన జానపద హారర్ థ్రిల్లర్ ‘ముత్తశ్శి’ (Muthassi), మరొకటి హృదయాన్ని కదిలించే ఆంథాలజీ డ్రామా ‘మనోరతంగల్’ (Manorathangal). మరి ఈ సిరీస్ లను ఎక్కడ చూడవచ్చు ? వాటి స్టోరీ ఏంటి ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

1. ముత్తశ్శి (Muthassi)

6 ఎపిసోడ్‌లతో విడుదలైన ఈ సిరీస్ ఇంటెన్స్ హారర్ మిస్టరీ థ్రిల్లర్. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఒక తుళు గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. రాజన్, లీల దంపతులు. చిన్న కొడుకు శ్రీకుట్టన్‌తో కలిసి పూర్వీకుల ఇంటికి వస్తారు. అయితే ఆ ఇంటికి వచ్చిన తర్వాత శ్రీకుట్టన్ వింతగా, క్రూరంగా ప్రవర్తించడంతో కథ మలుపు తిరుగుతుంది. దీనికి కారణం రాజన్ తల్లి గతంలో ఆ ఇంట్లో చేసిన క్షుద్ర పూజలు. వాళ్ళ రక్తసంబంధానికి ఉన్న ఒక ప్రాచీన శాపం అని లీలకు తెలుస్తుంది. ఆ తాంత్రిక శక్తుల నుండి, రాక్షసుడిగా మారుతున్న తన కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి పోరాటం చేసింది అనేదే ఈ సిరీస్ ముఖ్య కథాంశం. ఈ సిరీస్ ను రాత్రిపూట ఒంటరిగా చూడకండి.

2. మనోరతంగల్ (Manorathangal)

Advertisement

ఇది 9 కథల ఆంథాలజీ సిరీస్. మలయాళ సాహిత్య దిగ్గజం, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ రాసిన 9 ప్రసిద్ధ కథల ఆధారంగా రూపొందించారు. ఒకే కథ కాకుండా, 9 విభిన్న ఎపిసోడ్‌లలో 9 వేర్వేరు ఇండిపెండెంట్ కథలను చూపిస్తారు. మనుషుల జీవితాలు, విభిన్న భావోద్వేగాల చుట్టూ ఈ కథలు తిరుగుతాయి. ఈ సిరీస్‌లోని ప్రతి కథను కేరళకు చెందిన 8 మంది లెజెండరీ దర్శకులు తెరకెక్కించారు. అందులో ప్రియదర్శన్, సంతోష్ శివన్, మహేష్ నారాయణన్ తదితరులు ఉన్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాజిల్, పార్వతి తిరువోతు, బిజు మీనన్ వంటి సూపర్‌స్టార్లు ముఖ్య పాత్రలు పోషించారు. ZEE5లో ఈ రెండు సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ‘ముత్తశ్శి’ తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. ‘మనోరతంగల్’ మాత్రం తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

ఒకవేళ ఈ వీకెండ్ ఒక మంచి హర్రర్ సిరీస్ ను గనుక చూడాలి అనుకుంటే ‘ముత్తశ్శి’ బెస్ట్ ఆప్షన్. లేదు ఎమోషనల్ డ్రామా కావాలి అనుకుంటే ‘మనోరతంగల్’పై ఒక లుక్కేయవచ్చు. ఏదేమైనా రెండు సిరీస్ లు కూడా రెండ్ డిఫరెంట్ జానర్లో వచ్చిన జెమ్స్ అని చెప్పవచ్చు. పైగా రెండూ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. ఒకవేళ ఈ రెండింటిలో ఏ సిరీస్ ను చూడకపోయినా ఈ వీకెండ్ మర్చిపోకుండా ఒక లుక్కేయండి.

Advertisement

Read Also: సమయాన్ని దొంగిలించే శక్తులు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ క్రియేటర్స్ మరో మాస్టర్ పీస్

Tags

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×