E-Paper
Advertisement

OTT Movie : భర్తతో బోరింగ్ లైఫ్… ఒకే గదిలో ఒంటరిగా ప్రియుడితో… ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

OTT Movie : భర్తతో బోరింగ్ లైఫ్… ఒకే గదిలో ఒంటరిగా ప్రియుడితో… ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా
Advertisement

OTT Movie : ఈ ఏడాది మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చింది. ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. మరాఠీ సినిమాల్లో ఇది ఒక టైమ్‌పాస్ హిట్ గా చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ ఒక అపార్ట్‌మెంట్‌లో లాక్ అయిన హౌస్‌వైఫ్, ప్లంబర్ మధ్య జరిగే ఫన్నీ సిట్యువేషన్స్ తో మొదలవుతుంది. అందులో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారన్నదే ఈ కథ. ఫ్యామిలీతో కలసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. దీని పేరు ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2025లో విడుదలైన మరాఠీ కామెడీ సినిమా పేరు ‘సుషీలా సుజీత్’ (suSHEELA – suJEET). ప్రసాద్ ఓక్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సోనాలి కుల్కర్ణి (సుషీలా) స్వప్నిల్ జోషి (సుజీత్) లీడ్ రోల్స్ లో నటించారు. 1 గంట 35 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.1/10 రేటింగ్ పొందింది. 2025 ఏప్రిల్ 18న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సుషీలా అనే మిడిల్ ఏజ్ హౌస్‌వైఫ్, ఒక అపార్ట్‌మెంట్‌లో తన హస్బెండ్ రామకాంత్‌తో ఉంటుంది. ఆమె రోజూ వారి పనుల్లో బోరింగ్ లైఫ్ లో ఉంటుంది. హస్బెండ్ ఉద్యోగ రీత్యా బిజీగా ఉంటాడు. ఒక రోజు ఇంట్లో బాత్‌రూమ్ షవర్ లీక్ అవుతుంది, బెడ్‌రూమ్ డోర్ కూడా ప్రాబ్లమ్ (ఒకసారి లాక్ అయితే లోపలి నుంచి తెరవలేము). రామకాంత్ ప్లంబర్ సుజీత్ కి కాల్ చేసి, తర్వాత ఆఫీస్ వెళ్లిపోతాడు. సుజీత్ వచ్చి రిపేర్ మొదలెడతాడు. అతన్ని చూడగానే సుషీలా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. అతను అచ్చు తన కాలేజ్ డేస్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడు. అతను చాలా ఫ్రెండ్లీ, హ్యూమరస్ గా కనిపిస్తాడు. సుషీలా అతనితో మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తుంది.

సడన్‌గా ఒక గాలి వీచి బెడ్‌రూమ్ డోర్ గట్టిగా లాక్ అవుతుంది! వాళ్ల మొబైల్స్, ఇంటర్‌కామ్ అన్నీ బయట రూమ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు సుషీలా & సుజీత్ లోపల చిక్కుకుంటారు. బయటకు వెళ్లాలంటే ఏమీ చేయలేరు. సుషీలా ఎవరైనా చూస్తే ఏమవుతుంది?” అని మొదట భయపడుతుంది. ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇప్పుడు వాళ్లు లోపల చిక్కుకుని, బయటకు వెళ్లడానికి విచిత్రమైన ప్లాన్‌లు వేస్తారు. కానీ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఈ ప్రాసెస్‌లో వాళ్ల మధ్య మాటలు మొదలవుతాయి.

Advertisement

Read Also : దెయ్యాల కొంపలోకి తింగరి బ్రదర్స్… కామెడీతో కడుపుబ్బా నవ్వించే హారర్ సినిమా

సుషీలా తన బోర్ లైఫ్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తుంది, సుజీత్ తన లైఫ్, డ్రీమ్స్ చెబుతాడు. ప్లంబర్ స్కిల్స్ యూజ్ చేసి డోర్‌ని ఓపెన్ ట్రై చేస్తాడు కానీ ఫెయిల్ అవుతాడు. సుషీలా నువ్వు ప్లంబర్‌గా కూడా ఫెయిల్ అని టీజ్ చేస్తుంది. ఇక భర్త ఇంటికి వచ్చే టైమ్ అవుతుంది. సుషీలా మళ్ళీ టెన్షన్ లో పడుతుంది. చివరికి వీళ్ళు డోర్ ని ఓపెన్ చేస్తారా ? ఆ గదిలో నుంచి బయట పడతారా ? వీళ్ళ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది ? అనే విషయాలను, ఈ మరాఠీ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

Big Stories

Advertisement
×