E-Paper
Advertisement

ఇదెక్కడి సినిమా గురూ… ప్రేమ పేరుతో భార్యను సాఫ్ట్‌వేర్‌లో బంధించే సైకో భర్త

ఇదెక్కడి సినిమా గురూ… ప్రేమ పేరుతో భార్యను సాఫ్ట్‌వేర్‌లో బంధించే సైకో భర్త
Advertisement

Mystery Thriller on OTT : లవ్ స్టోరీలు వింత వింతగా ఉంటాయి. కొన్ని సైలెంట్ ప్రేమ కథలు, మరికొన్ని వయోలెంట్ ప్రేమ కథలు. సైలెంట్ ప్రేమ కథలు స్లో పాయిజన్ లా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఇక వయోలెంట్ లవ్ స్టోరీలు మాత్రం థ్రిల్లింగ్ ట్విస్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ను అలరిస్తాయి. ఈరోజు మన మూవీ సజెషన్ లో అలాంటి ఓ సైకో లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

రెండు ఓటీటీలలో అందుబాటులో

మైండ్-బెండింగ్ సైకలాజికల్ డిస్టోపియన్ థ్రిల్లర్ Don’t Worry Darling. 2022లో వచ్చిన ఈ మూవీకి ఒలివియా వైల్డ్ దర్శకత్వం వహించారు. ఫ్లోరెన్స్ పగ్, హ్యారీ స్టైల్స్ ప్రధాన పాత్రల్లో కన్పించారు. ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా కనిపించే అందమైన ప్రపంచం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాన్ని చూశాక లవ్ అంటేనే హడలిపోతారు. ఈ విజువల్ థ్రిల్లర్ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. Amazon Prime Video, Apple TV లో రెంట్‌కి ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ 1950ల కాలంలో మొదలవుతుంది కథ. కాలిఫోర్నియా ఎడారిలో ‘విక్టరీ’ (Victory) అనే ఒక ప్రైవేట్, విలాసవంతమైన పట్టణం ఉంటుంది. ఆలిస్, ఆమె భర్త జాక్ అక్కడే సంతోషంగా ఉంటారు. అయితే ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళంతా ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ కోసం పని చేస్తారు. ఆడవాళ్ళు మాత్రం ఇంట్లోనే ఉంటూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ పట్టణాన్ని ‘ఫ్రాంక్’ అనే వ్యక్తి చూసుకుంటాడు. ఇలా చూడడానికి ఇదంతా పర్ఫెక్ట్ గా, కలలాగా అన్పిస్తుంది.

అయితే ఆలిస్ పొరుగున మార్గరెట్ అనే మహిళ ఉంటుంది. ఆమె ఒకరోజు తన కొడుకును ఎడారిలోకి తీసుకెళ్తుంది. ఆ టైమ్ లో ఏదో చూశానని, ఈ పట్టణంలో ఏదో తప్పు జరుగుతోందని పిచ్చిదానిలా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆమె అందరూ చూస్తుండగానే బిల్డింగ్ పైనుండి దూకి ప్రాణాలు తీసుకుంటుంది. కానీ అక్కడి యాజమాన్యం ఆ విషయాన్ని బయటకు రానివ్వదు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆలిస్‌లో కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి. ఈ నేపథ్యంలోనే ఓరోజు ఆమె ఎడారిలో విమానం కూలిపోవడాన్ని చూస్తుంది. దానిని వెతుకుతూ వెళ్ళి ‘హెడ్‌క్వార్టర్స్’ ఉన్న వింతైన అద్దాల భవనాన్ని తాకుతుంది. ఆ క్షణం మొదలు.. ఆమెకు భయంకరమైన భ్రమలు, వింత కలలు రావడం షురూ అవుతుంది. దీంతో ఆలిస్ తన భర్తను నిలదీయడంతో అసలైన షాకింగ్ నిజం బయట పడుతుంది. ఆ షాకింగ్ నిజం ఏంటి? విషయం తెలిశాక ఆలీస్ ఏం చేసింది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను వీక్షించండి.

Advertisement

Read Also : పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్… వైలెంట్ గా మారే సైలెంట్ కానిస్టేబుల్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×