E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి     

Nindu Noorella Saavasam Serial Today Episode May 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి     
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ కలసి అంజును రణవీర్‌తో పంపిచేస్తారు. తర్వాత మనోహరి మిస్సమ్మ దగ్గరకు వెళ్లి ఏంటి భాగీ అంజు వెళ్లిపోతుంటే అపుతావు అనుకున్నాను. కానీ సైలెంట్‌గా సినిమా చూసినట్టు చూశావేంటి..? నిన్నేమో ఆ టెంపరరీగా ఆపగలిగావు. ఈరోజు పర్మినెంట్‌గా ఆపలేకపోయావు కదా.. అంటూ మాట్లాడుతుంటే.. దూరం నుంచి చూస్తున్న యాదమ్మ మాత్రం మనోహరి ఏంటి భాగీతో అలా మాట్లాడుతుంది. కామ్‌గా వెళ్తున్న కోబ్రా మీద కాలేసి కాటేయించుకోవడం అంటే ఇదేనేమో.. మనోహరికి ఇది అవసరమా..? అనుకుంటుంది. మనోహరి మాత్రం అయినా ఎలా ఆపుతావు. ఆపితే నీ పసుపుకుంకుమలు పుట్టుక్కు మంటాయి కదా.. అనగానే.. మిస్సమ్మ కోపంగా ఏయ్‌ అంటూ చూస్తుంది.

మనోహరి కోపంగా ఏంటి భాగీ అరుస్తున్నావు.. నిజం చెప్తే. నీ భర్త ఐ మీన్‌ నాకు కాబోయే  భర్త అమర్‌ ప్రాణాలతో ఉండడు కదూ అనగానే.. అందుకే చాలా ఓపికగా ఉన్నాను అంటుంది మిస్సమ్మ. మనోహరి కూడా అందుకే నేను ఆ పీక్‌ పాయింట్‌ మీద దెబ్బ కొట్టాను ఎలా ఉంది నా దెబ్బ అదుర్స్‌ కదూ.. అనగానే.. యాదమ్మ మాత్రం పడుకున్న పులితోక పట్టుకుని పరాచకాలు ఆడటం అంటే ఇదేనేమో మనోహరి అని మనసులో అనుకుంటుంది. మనోహరి మాత్రం అంజుతో మొదలైన ఈ సాగనంపే ప్రయాణం నీ కూతురు ఆరుతో ఎండ్‌ అవుతుంది. మెల్లగా ఒక్కోక్కరిని నీతో సహా ఇంట్లోంచి పంపిచేస్తాను అంటూ వార్నింగ్ ఇవ్వగానే.. అది నీ తరం కాదు అంటుంది మిస్సమ్మ. ఎందుకు కాదు నిన్ను నీ కూతరును ఐదేళ్లు ఈ ఇంట్లోంచి పంపించేయలేదా..? ఈరోజుకు అంజుకు పాథర్‌గా రణవీర్‌ను  సెట్‌ చేసి పంపించాను.

Advertisement

రేపు ఆనంద్‌ను ఎల్లుండి ఆకాష్‌ను ఆ తర్వాత ఆరును పంపించేస్తాను. నువ్వు ఈ రోజు లాగే చూస్తూ ఉండటం తప్పా ఏమీ చేయలేవు.. తను ఆశ్రయం ఇచ్చిన పిల్లలు సొంత గూటికి చేరుకున్నారు అని అమర్‌ అమాయకంగా ఆనందపడతాడు. చివరగా నీకు కూడా ఒక ఫేక్‌ మొగుడిని అంటగట్టి ఇంట్లోంచి పంపించేస్తాను. రాథోడ్‌ను జాబ్‌ లోంచి తీసేస్తాను. ఫైనల్‌గా నేను అమర్‌ మాత్రమే ఈ ఇంట్లో ఉంటాము అని చెప్పగానే.. యాదమ్మ భయంగా అంటే నన్ను కూడా పంపించేస్తుందా..? అని మనసులో అనుకుంటుంది. అప్పుడే మనోహరి మాకు వండి పెట్టడానికి ఇదిగో ఈ యాదమ్మ మాత్రమే ఉంటుంది. అని చెప్పగానే.. యాదమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. మనోహరి.. అమర్‌, నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం.. కథ సుఖాంతం అంటూ చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా నీ పాపం పండకుండా.. నీకు శిక్ష పడకుండా ఈ కథ అయిపోదు మనోహరి అంటుంది. దీంతో మనోహరి కోపంగా అది యాంటీ క్లైమాక్స్‌ భాగీ అలా జరిగే అవకాశమే లేదు అనగానే.. మిస్సమ్మ కోపంగా తప్పులు చేసేవారు తప్పించుకునే అవకాశమే లేదు అంటుంది.

దీంతో మనోహరి నిజమే నేను ఒప్పుకుంటాను కానీ నా విషయంలో అలా జరగడం లేదే..? నేను ఎన్నో తప్పులు చేశాను. అమర్‌కు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాను. కానీ ఆ దేవుడు నన్ను క్షమించాడు. అమర్‌ గతం మర్చిపోయేలా చేసి నాకు సెకండ్‌ చాన్స్‌ ఇచ్చాడు అంటూ చెప్పుకుంటుంటే.. మిస్సమ్మ కోపంగా ఇది దేవుడు నువ్వు మంచిగా మారడానికి ఇచ్చిన అవకాశం. కానీ నువ్వు ఈ చాన్స్‌ను మిస్‌ యూజ్‌ చేసుకుంటున్నావు.. అని చెప్పగానే.. మనోహరి మిస్‌ యూజ్‌ కాదు భాగీ నాకు యూజ్‌ అయ్యేలా చేసుకుంటున్నాను. నేను అమర్‌కు మిస్సెస్‌ అయ్యేలా చేసుకుంటున్నాను అని చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా అది ఎప్పటికీ జరిగే పని కాదు అనగానే.. జరుగుతుంది జరిగి తీరుతుంది నువ్వు అమర్‌కు ఎప్పటికీ నిజం చెప్పలేవు.. గతం మర్చిపోయిన అమర్‌ నేను చెప్పిందే నమ్ముతాడు. ఆ పిల్లలు నువ్వు ఈ రాథోడ్‌ లగేజ్ సర్దుకుని రెడీగా ఉండండి. వరుసగా ఒక్కోక్కరికి ప్యాక్‌ అప్‌ చెప్పేస్తాను. ఇదే జరుగుతుంది అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది మనోహరి.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×