E-Paper
Advertisement

Medical Bill: 90 నిమిషాల చికిత్సకు రూ. 1.65 లక్షల బిల్లు.. షాక్‌లో బాధితుడు, ఎక్కడో తెలుసా..?

Medical Bill: 90 నిమిషాల చికిత్సకు రూ. 1.65 లక్షల బిల్లు.. షాక్‌లో బాధితుడు, ఎక్కడో తెలుసా..?
Advertisement

అగ్రరాజ్యం అమెరికాలో వైద్యం అంటేనే సామాన్యుడి వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడ ఇన్సూరెన్స్ ఉన్నా సరే, అనారోగ్యం బారిన పడితే కోలుకోవడం కంటే ముందే ఆర్థికంగా కుంగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం అమెరికా ఆరోగ్య మౌలిక సదుపాయాల దుస్థితికి అద్దం పడుతోంది. కేవలం గంటన్నర సేపు ఆసుపత్రిలో ఉన్నందుకు, ఆ వ్యక్తి ఏకంగా $1,800 (సుమారు రూ. 1.65 లక్షలు) తన జేబు నుండి చెల్లించాల్సి వచ్చింది.

అసలేం జరిగింది?

Advertisement

క్రిస్మస్ పండుగ వేళ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ నగరంలో ఐస్ స్కేటింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి మోకాలికి గాయమైంది. మోకాలు విరిగిందేమో అన్న భయంతో అతను వెంటనే టాక్సీలో ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాడు. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి, ఒక ఎక్స్-రే (X-ray) తీసి, మోకాలికి బ్యాండేజ్ కట్టారు. ఈ మొత్తం ప్రక్రియకు పట్టిన సమయం కేవలం 1.5 గంటలు మాత్రమే.

అయితే, మూడు వారాల తర్వాత అతనికి వచ్చిన ఇన్సూరెన్స్ నోటిఫికేషన్ చూసి కంగుతిన్నాడు. ఆ కొద్దిపాటి చికిత్సకు అయిన మొత్తం బిల్లు $6,354 (సుమారు రూ. 5.8 లక్షలు). ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ కొంత భరించగా.. సదరు వ్యక్తి తన సొంత డబ్బు నుండి రూ. 1.65 లక్షలు చెల్లించాలని కంపెనీ స్పష్టం చేసింది. తన వద్ద మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నప్పటికీ ఇంత భారీ మొత్తం చెల్లించాల్సి రావడంపై అతను సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

ఈ ఉదంతంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అమెరికా వైద్య విధానం చిన్న గాయాలను కూడా పెద్ద ఆర్థిక గాయాలుగా మార్చడంలో దిట్ట’ అని ఒకరు విమర్శించారు. ఇదే చికిత్స భారత్‌లో అయితే కన్సల్టేషన్, మందులతో కలిపి గరిష్టంగా రూ.1,000 నుండి రూ.3,000 లోపు పూర్తవుతుందని, కెనడా వంటి దేశాల్లో పబ్లిక్ హెల్త్ కేర్ ద్వారా ఉచితంగా సేవలు అందుతాయని నెటిజన్లు పోలుస్తున్నారు. ‘ఇక్కడ దెబ్బ తగిలింది మోకాలికి కాదు, పర్సుకి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

అమెరికాలో ఆరోగ్య సంరక్షణ అనేది ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలతో కూడిన అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థ. మెజారిటీ ప్రజలు ప్రైవేట్ ఇన్సూరెన్స్‌పైనే ఆధారపడతారు. 65 ఏళ్లు పైబడిన వారికి మెడికేర్, తక్కువ ఆదాయం ఉన్నవారికి మెడికెయిడ్ వంటి ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చులు పెనుభారంగా మారుతున్నాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నా.. డిడక్టబుల్స్,  అవుట్ ఆఫ్ పాకెట్ ఖర్చుల పేరుతో రోగుల నుండి భారీగా వసూలు చేయడం అక్కడ సర్వసాధారణంగా మారింది.

ALSO READ: The Raja Saab: నార్త్ అమెరికాలో ది రాజా సాబ్ పరిస్థితి మరీ దారుణం.. ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×