E-Paper
Advertisement

Social Drama OTT: ఆకలితో అబ్బురపరిచే స్కెచ్.. కన్నీళ్లు తెప్పిస్తున్న కామెడీ సినిమా

Social Drama OTT: ఆకలితో అబ్బురపరిచే స్కెచ్..  కన్నీళ్లు తెప్పిస్తున్న కామెడీ సినిమా
Advertisement

Social Drama OTT : సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు అప్పుడప్పుడు జనాలను ఆలోచింపజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఏ తోడు లేక ఆకలి కోసం అలమటించే ముగ్గురు ముసలి వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇక వీళ్ళు చేసే పనులు ఓపక్క నవ్వు తెప్పిస్తూనే, ఓ పక్క కన్నీళ్ళు తెప్పిస్తుంటాయి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఈ ఫీల్ గుడ్ కొరియన్ సినిమా పేరు ‘పీపుల్ అండ్ మీట్’ (People and Meat). 2025లో వచ్చిన ఈ సినిమా, యాంగ్ జోంగ్-హ్యూన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో పార్క్ కీన్ హ్యోంగ్, జాంగ్ యోంగ్, యే సు జియోంగ్ వృద్ధులుగా నటించారు. ఈ చిత్రం 2025 ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ విభాగంలో పోటీ పడింది. అలాగే 2025 సెప్టెంబర్‌లో జరిగిన 30వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సియోల్ నగరంలో ఒంటరితనం, పేదరికంతో బాధపడుతున్న ముగ్గురు వృద్ధుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకాయన పేరు వూ-సిక్, ఇంకో ఆయన పేరు హ్యూంగ్-జున్, ఒక బామ్మ హ్వా-జిన్. వీళ్లంతా సియోల్ నగరంలో పైసా లేక, పట్టించుకునే దిక్కులేక చాలా కష్టాల్లో ఉంటారు. ఒంటరితనంతో చచ్చిపోలేక బతుకుతుంటారు. ఒకరోజు ముగ్గురూ కలిసి, ఎలాగైనా మంచిగా ముక్క చుక్క తో పసందైన విందు తినాలని ప్లాన్ వేస్తారు. కానీ చేతిలో చిల్లిగవ్వ ఉండదు.

ఇక అప్పట్నుంచి వీళ్లు ఒక టీమ్ లాగా మారి ఒక వింత నిర్ణయం తీసుకుంటారు. బడా బడా హోటళ్లకు, కొరియన్ బార్బెక్యూ రెస్టారెంట్లకు రాజసంలాగా వెళ్తారు. అక్కడ కడుపు నిండా మాంసం తిని, మందు కొట్టి, బిల్లు కట్టే టైం వచ్చేసరికి ఎవరికీ దొరక్కుండా మెల్లగా జారుకుంటారు. ఈ వయసులో వీళ్లు చేసే ఈ తిక్క పనులు చూస్తుంటే నవ్వు వస్తుంది కానీ, అసలు విషయం ఏంటంటే ఆకలి తీర్చుకోవడమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉండటం కోసమే వాళ్లు ఈ వేషాలు వేస్తారు. ఇక చివరికి ఈ జీవితాలకు ఎలాంటి ముగింపు ఉంటుందనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : Pennu Case OTT : నిత్య పెళ్ళికూతురు నిఖిలా విమల్ మలయాళ మూవీ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×