BigTV English

OTT Movie : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

OTT Movie : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా
Advertisement

OTT Movie : మంచి కంటెంట్ ని ఇస్తున్న ఓటీటీలలో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఒకటి. టాప్ రేటింగ్ ఉన్న సినిమాలు, సిరీస్ లను ఈ సంస్థ ఆడియన్స్ కి అందించడానికి పోటీ పడుతోంది. సరికొత్త సిరీస్ లను స్ట్రీమింగ్ కి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఒక హిస్టారికల్ యాక్షన్ సిరీస్, రీసెంట్ గా ఓటీటీలో మంచి వ్యూస్ తో అదరగొడుతోంది. ఈ కథ ఐదు వందల సంవత్సరాల క్రితం జరుగుతుంది. ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకునే క్రమంలో ఈ స్టోరీ పరుగులు పెట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘నీరో ది అసాసిన్’ (Nero the assassin) ఒక ఫ్రెంచ్ హిస్టారికల్ యాక్షన్ సిరీస్. దీనికి ఆలన్ మాఉడ్యూట్, మార్టిన్ డౌఎర్, జీన్-పాట్రిక్ బెనెస్, నికోలస్ డిగార్డ్ అనే నలుగురు దర్శకులు పని చేశారు. ఇందులో పియో, అలిస్, హోరేస్ ప్రధాన పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్‌ IMDbలో 7.6/10 రేటింగ్ పొందింది. ఇది 2025 అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది.

కథలకి వెళ్తే

పదిహేనవ శతాబ్ధం లో ఫ్రాన్స్‌లో నీరో అనే ఒక క్రూరమైన క్రిమినల్ ఉంటాడు. అతను హోరేస్ అనే పవర్‌ఫుల్ వ్యక్తి కోసం పనిచేస్తుంటాడు. నీరో చాలా తెలివైన వ్యక్తి, ఎంతో మందిని చంపిన హంతకుడు. ప్రస్తుతం అతని జీవితం ఒడిదుడుకుల్లో ఉంటుంది. అతనికి పెర్లా అనే కూతురు ఉంటుంది. అయితే ఆమెను కూడా అతను చిన్నప్పుడే వదిలేస్తాడు. పెర్లా తల్లి కూడా ఒక వేశ్యగా ఉండేది. తను కూడా చనిపోయి ఉంటుంది. ఇప్పుడు పెర్లాకి పద్దెనిమిది సంవత్సరాలు వస్తాయి. అయితే ఆమె డేంజర్‌లో ఉంటుంది. హోరేస్, పెర్లాను టార్గెట్ చేస్తాడు. నీరో తన బాస్ హోరేస్‌ చేతిలో మోసపోవడంతో, అతను పెర్లాను కాపాడాలని నిర్ణయించుకుంటాడు. నీరో, పెర్లాను కలుస్తాడు. కానీ పెర్లాకు నీరో తన తండ్రి అని తెలియదు. అతను ఆమెను సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు.


Read Also : ఓరి నాయనో… ఈ ఫ్యామిలీ మొత్తం తేడానే… ఏమైనా చేస్కోమంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చే చెల్లి

పెర్లా కూడా చాలా ధైర్యం ఉన్న అమ్మాయి. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు ఫేస్ చేసింది. నెరో, పెర్లా కలిసి హోరేస్ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ వీళ్ళ చేతిలో, ఆ రాజ్యానికి చెందిన ఒక మంత్రి కూతురు కూడా చిక్కుకుంటుంది. ఇక వీళ్ళ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కొంతమంది సైకోలు. మంత్రగాళ్ళు వీళ్ళను వెంబడిస్తారు. ఇక కథ ఉత్కంఠంగా నడుస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. అసలు హోరేస్ ఎందుకు పెర్లాని టార్గెట్ చేశాడు ? పెర్లాకి తన తండ్రి ఎవరో తెలుస్తుందా ? నీరో తన కూతుర్ని కాపాడతాడా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా

OTT Movie : మాంసం కొట్టు యజమాని మర్డర్… ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కన్నడ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Netflix Upcoming Movies : నెట్ ఫ్లిక్స్‌లో సినిమాల జాతర… 6 సినిమాలు ఒకే రోజు… డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్

OTT Movie : చెరువులో మనిషి పుర్రె… మర్డర్ మిస్టరీలో మతిపోగోట్టే ట్విస్టులు… టెన్షన్ పెట్టే ఇంటెన్స్ మలయాళ థ్రిల్లర్

Jr.NTR Dragon OTT : ఓటీటీ లవర్స్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్… డ్రాగన్‌తో అంత ఈజీ కాదు

Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడేనా?

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×