Bigg Boss Ritu Chaudhary : బిగ్ బాస్ సీజన్ 9 లో ఉన్న కంటెస్టెంట్స్ లో రీతు చౌదరి ఒకరు. రీతు చౌదరి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సీరియల్స్ తో పాటు రియాలిటీ షోస్ లో కూడా కనిపించింది. ముఖ్యంగా హైపర్ ఆది టీం లో కంటెస్టెంట్ గా కనిపించి జబర్దస్త్ తో మంచి పాపులారిటీ కూడా సాధించుకుంది. టీవీ ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ వస్తే చాలు ఆటోమేటిక్ గా బిగ్ బాస్ వంటి రియాలిటీ షో కు ఎంట్రీ లభిస్తుంది.
అలానే రీతు చౌదరి తో పాటు చాలామంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. వారందరూ కూడా ఎవరికి ఏం వాళ్ళు ఆడుతున్నారు. బిగ్బాస్ కు ఎంట్రీ ఇచ్చిన వాళ్లను గమనిస్తే సుమన్ శెట్టి మినహా మిగతా సెలబ్రిటీలు అంతా కూడా సీరియల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లతోపాటు కామనర్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆరువ వారం సాగుతుంది. ఇప్పటికే ఆరుగురు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఆరుగురు ఎంట్రీ ఇచ్చారు. ఎంతమంది వచ్చిపోయినా కానీ రీతు చౌదరి ఆట తీరు మాత్రం మారడం లేదు.
రీతు చౌదరి తాను ప్రత్యేకంగా గేమ్ ఆడుతున్నాను అని అనుకుంటుంది. కానీ రీతు చౌదరి ఆడే తీరు చూస్తుంటే పెద్దగా ఎవరిని ఇంప్రెస్ చేయదు అని చెప్పాలి. ఆ టైం దాటి పోవడం కోసం మిగతా హౌస్ మేట్స్ ను అడుక్కోవడం మొదలుపెట్టింది.
ఒకవేళ టాస్కులు జరిగితే సపోర్ట్ చేయమని అడుక్కుంటుంది. నామినేషన్స్ జరిగితే సేవ్ చేయమని అడుక్కుంటుంది. పోయిన వారం డిమాన్ పవన్, రాము లను అడిగింది. ఇప్పుడు కెప్టెన్ కళ్యాణ్ ను అడగడం మొదలుపెట్టింది. కేవలం తన అవసరాలు నిమిత్తమే సీజన్ లో సర్వైవ్ అయిపోతుంది.
మామూలుగా ఏదైనా ఆర్గ్యుమెంట్ లో అరవమంటే బీభత్సంగా అరుస్తుంది. తనను నామినేషన్ లో పెడితే కోపమంతా ప్రదర్శిస్తుంది. అలానే ఏదైనా టాస్క్ వరస్ట్ గా ఆడితే వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటుంది. పిరమిడ్స్ టాస్క్ లో కూడా గెలవల్సిన దానిని పోగొట్టినందుకు పవన్ అన్న మాటలకు వెక్కివెక్కి ఏడ్చేసింది.
నిజంగా ఒక ప్లేయర్ కి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా రీతు చౌదరిలో లేవు అనేది చాలా మందికి ఉన్న అభిప్రాయం. కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో వచ్చిన వాళ్లను చూసైనా తన ఆట తీరును మారుస్తుందో. లేకపోతే ఇలానే సర్వైవ్ అవ్వడానికి ప్రతి ఒక్కరిని అడుక్కుంటుందో ముందు ముందు తెలుస్తుంది.
Also Read : Mega 158 : బాబీ సినిమాలో మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళం బ్యూటీ