Lazawal Ishq Show: సాధారణంగా పలు భాషలలో ఎన్నో రకాల రియాలిటీ షోలు ప్రసారమౌతూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ఒకప్పుడు ఈ రియాలిటీ షోలు కేవలం స్మాల్ స్క్రీన్ పై మాత్రమే ప్రేక్షకులను సందడి చేసేవి కానీ ఇటీవల కాలంలో యూట్యూబ్ అలాగే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటిలో కూడా రియాలిటీ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక రియాలిటీ షో అంటే సమాజానికి కాస్తయిన ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఇటీవల కాలంలో వస్తున్న రియాలిటీ షోలు కొన్ని తప్పుడు మార్గాన్ని సూచిస్తున్న నేపథ్యంలో వాటిపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుంది.
ఈ క్రమంలోనే పాకిస్థాన్(Pakistan) లో ఒక షోపై ఇలాంటి వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటివరకు ఎవరూ కూడా నిర్వహించని విధంగా పాకిస్తాన్ లో డేటింగ్ రియాలిటీ షో(Dating Reality Show)ని ప్రారంభించడం గమనార్హం. ఈ రియాలిటీ షో ని యూట్యూబ్ లో ప్రసారం చేస్తున్నారు.”లాజావల్ ఇష్క్”, (Lazawal Ishq)పేరిట ఈ కార్యక్రమం సెప్టెంబర్ నుంచి ప్రసారమవుతుంది అయితే అన్ని రియాలిటీ షో మాదిరిగానే ఈ కార్యక్రమం కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని భావించారు కానీ ఈ షో పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
ఈ రియాలిటీ షోకి నటి నటి ఆయేషా ఒమర్ (Ayesha Omar)హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ లవ్ ఐలాండ్గా బ్రాండ్ చేయబడిన ఈ రియాలిటీ షో ఇస్తాంబుల్‌లో షూటింగ్ నిర్వహించారు. ఈ రియాలిటీ షోలో చుట్టూ కెమెరాలు ఉన్న ఒక భవనంలో నలుగురు అమ్మాయిలు అబ్బాయిల మధ్య రేటింగ్ రిలేషన్ గురించి చూయిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి ఊహించని వ్యతిరేకత ఏర్పడింది. ఈ కార్యక్రమం సామాజిక విలువలను దెబ్బతీసేలాగా ఉందని అలాగే ఇస్లామిక్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది అంటూ వ్యతిరేకత ఏర్పడింది.
వెంటనే షో రద్దు చేయాలి..
ఈ కార్యక్రమం ద్వారా మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, అశ్లీలత అవినీతిని ప్రోత్సహిస్తుంది అంటూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత రావటమే కాకుండా ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు.ఇస్లామాబాద్ హైకోర్టులో ఈ షో నిలిపివేయాలి పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ లో ఆన్ లైన్ లో ఈ విధమైనటువంటి అశ్లీలత కలిగిన కంటెంట్ కు ఏ విధంగా అంగీకారం తెలుపుతున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీని సంప్రదించాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఈ కార్యక్రమానికి కోర్టులో కూడా వ్యతిరేకత రావడంతో సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతూ అభిమానులు ఈ కార్యక్రమం పై వారి అభిప్రాయాలను తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. చాలామంది ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా పోస్ట్ లు చేయగా కొంతమంది సానుకూలంగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!