E-Paper
Advertisement

OTT Movie : ఈ ఫ్రైడే ఓటీటీలో దుమ్ములేపడానికి వస్తున్న సినిమాలు ఇవే… ఎందులో చూడచ్చో తెలుసా ?

OTT Movie : ఈ ఫ్రైడే ఓటీటీలో దుమ్ములేపడానికి వస్తున్న సినిమాలు ఇవే… ఎందులో చూడచ్చో తెలుసా ?
Advertisement

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లలో ఎక్సైటింగ్‌గా ఉండే సినిమాలు రాబోతున్నాయి. ఫ్రైడే నుంచి స్ట్రీమింగ్‌లోకి వస్తున్న ఈ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు మీ వీకెండ్‌ను మరింత థ్రిల్లింగ్‌గా మార్చేస్తాయి. కామెడీ నుంచి థ్రిల్లర్, మిస్టరీ వరకు అన్ని జానర్‌లు కవర్ అవుతున్నాయి. ముఖ్యంగా Single Papa, Saali Mohabbat, Wake Up Dead Man: A Knives Out Mystery, The Great Shamsuddin Family, Man vs. Baby వంటి పూర్తి లిస్ట్ మీకోసమే. ఇక పాప్‌కార్న్ రెడీ చేసుకోండి!

1. Single Papa (కామెడీ సిరీస్)

30 ఏళ్ల గౌరవ్ గెహ్లోట్ (కుణాల్ కెమ్ము) డివోర్స్ అయిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక బేబీని అడాప్ట్ చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్యామిలీ ఎమోషనల్ మూమెంట్స్‌తో ఫాదర్‌హుడ్ జర్నీ అద్భుతంగా డెపిక్ట్ చేస్తుంది. ఇందులో కుణాల్ కెమ్ము, ప్రజక్తా కోళి, మనోజ్ పావా, నెహా ధూపియా, అయేషా రాజా వంటి నటులు నటించారు. Netflix లో ఈ సిరీస్ 2025 డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

2. Saali Mohabbat (సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)

Advertisement

స్మితా (రాధికా ఆప్టే) అనే హౌస్‌వైఫ్ లైఫ్ డబుల్ మర్డర్ తర్వాత ఊహించని విధంగా మారిపోతుంది. తిస్కా చోప్రా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రాధికా అప్తే, దివ్యేందు శర్మ, అనురాగ్ కశ్యప్, శరత్ సక్సేనా తదితురులు నటించారు. ఇది ZEE5 లో 2025 డిసెంబర్ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది.

3. Wake Up Dead Man: A Knives Out Mystery (మిస్టరీ థ్రిల్లర్ మూవీ)

డిటెక్టివ్ బెనాయిట్ బ్లాంక్ (డానియల్ క్రెయిగ్) ఒక చర్చ్ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఎక్సెంట్రిక్ సస్పెక్ట్స్, ట్విస్ట్స్ తో ఈ సినిమా కావాల్సినంత థ్రిల్ ని ఇస్తుంది. ఇది Knives Out ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్. రియాన్ జాన్సన్ డైరెక్షన్ లో డానియల్ క్రెయిగ్, జోష్ ఓ’కానర్, గ్లెన్ క్లోజ్, జోష్ బ్రోలిన్, మిలా కునిస్, జెరెమీ రెన్నర్ వంటి తారాగణం ఉంది. ఇది Netflix లో 2025 డిసెంబర్ 12 నుంచి వస్తోంది.

4. The Great Shamsuddin Family (కామెడీ మూవీ)

Advertisement

షమ్సుద్దీన్ ఫ్యామిలీలో ఒక రోజు రూ.25 లక్షలు మిస్సింగ్ తో స్టోరీ మొదలవుతుంది. ఇది సడన్ మ్యారేజ్, ఫ్యామిలీ ఎమోషనల్ మూమెంట్స్, కామెడీ రికాన్సిలియేషన్స్‌తో కూడిన ఫ్యామిలీ స్టోరీ. ఇందులో కృతికా కమరా, ష్రేయా ధన్వంతరి, ఫరీదా జలాల్, షీబా చాధా, డాలీ అహ్లువాలియా వంటి నటులు నటించారు. JioHotstar లో ఈ మూవీ 2025 డిసెంబర్ 12 స్ట్రీమింగ్ కి వస్తోంది.

5. Man vs. Baby (కామెడీ మూవీ)

ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ పేరెంట్‌హుడ్ చాలెంజెస్‌తో కూడిన హిలేరియస్ రొమ్ కామ్. ఫన్నీ మూమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. Netflix లో : 2025 డిసెంబర్ 12 నుంచి అందుబాటులో ఉంటుంది.

వీటితో పాటు డుల్కర్ సల్మాన్ ‘Kaantha’ (తెలుగు/తమిళ్ పీరియడ్ థ్రిల్లర్) Netflix (డిసెంబర్ 12). సూపర్‌స్టార్ vs. డైరెక్టర్ ఎగో క్లాష్ మర్డర్ మిస్టరీ. జేమ్స్ గన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘Superman’ JioHotstar (డిసెంబర్ 11) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 

Read Also : ఏడేళ్లకే పెళ్లి ఎనిమిదేళ్లకు వితంతువు… బాయ్ ఫ్రెండ్ తో మరొక్కసారి… మస్ట్ వాచ్ థ్రిల్లర్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×