E-Paper
Advertisement

South Movies on OTT : ‘గాంధీ టాక్స్’ నుంచి ‘విత్ లవ్’ వరకు… ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సౌత్ సినిమాలు ఇవే

South Movies on OTT : ‘గాంధీ టాక్స్’ నుంచి ‘విత్ లవ్’ వరకు… ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సౌత్ సినిమాలు ఇవే
Advertisement

South Movies on OTT : సినిమా ప్రేమికులకు ఈ వీకెండ్ మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సరికొత్త సినిమాలతో మన ముందుకు వచ్చేశాయి. ఈ వారం సౌత్ నుంచి డిఫరెంట్ జోనర్స్ కలిగిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ నుంచి లవ్ స్టోరీల వరకు.. మీ వీకెండ్ ప్లాన్ కోసం ఇక్కడ అదిరిపోయే లిస్ట్ ఉంది. ఈ వీకెండ్‌లో మీకు నచ్చిన జోనర్‌ను బట్టి, ఈ సినిమాలను చూసేయండి. కామెడీ, హారర్, థ్రిల్లర్ ఇలా అన్నీ రకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంటినే థియేటర్‌గా మార్చేసుకోండి. ఇప్పుడు ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ లో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

1. గాంధీ టాక్స్ (Gandhi Talks)

ఈ వారం టాప్ లిస్ట్‌లో ఉన్న సినిమా ‘గాంధీ టాక్స్’. ఇది ఒక సైలెంట్ మూవీ. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మాటలు లేకపోయినా, కేవలం ఎక్స్‌ప్రెషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కథను నడిపించిన తీరు అద్భుతం. ఒక కొత్త అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను మిస్ అవ్వకండి. మార్చి 6 నుంచి ఈ సినిమా ZEE5లో అందుబాటులో ఉంటుంది.

2. ఓం శాంతి శాంతిహి (Om Shanti Shantihi)

Advertisement

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తెలుగు చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ Aha Video లో 2026 మార్చి 4 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఆహా గోల్డ్’ సభ్యులకు ఒక రోజు ముందుగానే (మార్చి 3న) యాక్సెస్ లభించింది. ఇది మలయాళ సూపర్ హిట్ సినిమా ‘జయ జయ జయ జయ హే’ కి అధికారిక రీమేక్. ఒక మధ్యతరగతి అమ్మాయి (ప్రశాంతి) తన ఆశయాలను చంపుకుని పెళ్లి చేసుకుంటుంది. కానీ తన భర్త (ఓంకర్) అహంకారాన్ని ఎదుర్కొని, తిరిగి తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుందనే అంశాన్ని దర్శకుడు ఏఆర్ సజీవ్ వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించారు.

3. జాకీ (Jockey)

యాక్షన్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఇష్టపడే వారికి ‘జాకీ’ మంచి ఛాయిస్. పొట్టేలు పందాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పందెం వెనుక ఉండే రాజకీయం, ఎమోషన్స్‌ను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. మార్చి 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

4. గ్రానీ (Granny)

Advertisement

హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘గ్రానీ’ భయపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఒక పాత ఇంట్లో జరిగే మిస్టరీ సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మేకింగ్ పరంగా, సౌండ్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి చూస్తే ఆ కిక్కే వేరు. ఇది మార్చి 6 నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

5. విత్ లవ్ (With Love)

ప్యూర్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ‘విత్ లవ్’ బెస్ట్ ఆప్షన్. నేటి తరం ప్రేమకథలను, రిలేషన్‌షిప్‌లో ఉండే కాంప్లికేషన్స్‌ని చాలా సున్నితంగా ఈ సినిమాలో చూపించారు. పాటలు, విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉంటాయి. మార్చి 6 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది

6. ధీరం (Dheeram)

ఇది ఒక పక్కా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. వరుస హత్యల చుట్టూ తిరిగే ఈ కథ, ప్రేక్షకులను సీటు ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. సస్పెన్స్‌ను చివరి వరకు మెయింటైన్ చేశారు ఇందులో. మిస్టరీ సినిమాల ఫ్యాన్స్‌కు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మార్చి 6 నుంచి ఈ సినిమా సన్‌ ఎన్‌ఎక్స్‌టి లో స్ట్రీమింగ్ అవుతుంది.

Read Also : 40 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనలు… అనేక అవార్డులు గెలుచుకున్న ఈ క్రేజీ మూవీ చూశారా?

 

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×