E-Paper
Advertisement

Hisar Train: సికింద్రాబాద్- హిస్సార్ రైలుకి తప్పిన పెను ప్రమాదం.. నిలిపివేసిన అధికారులు, అసలేం జరిగింది?

Hisar Train:  సికింద్రాబాద్- హిస్సార్ రైలుకి తప్పిన పెను ప్రమాదం.. నిలిపివేసిన అధికారులు, అసలేం జరిగింది?
Advertisement

Hisar Train: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో రైళ్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సికింద్రాబాద్ -హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. వెంటనే అలర్టయిన సిబ్బంది.. ఆ రైలుని నాలుగు గంటలపాటు నిలిపి వేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది?

సికింద్రాబాద్- హిస్సార్ రైలుకి తప్పిన పెను ప్రమాదం

Advertisement

గురువారం తెల్లవారుజామున మడిపల్లి సమీపంలో హిసార్ ఎక్స్‌ప్రెస్ చక్రం విరిగిపోవడంతో గమనించిన సిబ్బంది రైలుని నిలిపివేశారు. దాదాపు నాలుగు గంటలపాటు రైలుని నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాజీపేట-బల్హర్షా మార్గంలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

దీంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. అనంతరం వేరే ఇంజన్‌తో రైలుని ఉప్పల్ రైల్వేస్టేషన్ కి తరలించారు. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న సమస్యను పరిష్కరించడానికి ఇంత ఆలస్యమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

విరిగిన రైలు చక్రం.. రైలుని నిలిపివేసిన అధికారులు

ఇటీవల కాలంలో రైళ్లలో వేర్వేరు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య విశాఖ నుంచి విజయవాడ వస్తున్న రైళ్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  విజయవాడకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఇది జరిగిన కొద్దిరోజులకు వివిధ ప్రాంతాల్లో రకరకాల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రైలు చక్రం వంతైంది. ఇలా వరుసగా ఘటనలు జరుగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థి ఎవరు.. నో చెప్పిన ఓ కీలక నేత..?

 

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×