E-Paper
Advertisement

SRH: ద‌య‌, జాలిలేని మెంట‌ల్ కొడుకులను కొనేసిన కావ్య పాప‌..ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు న‌ర‌క‌మే !

SRH: ద‌య‌, జాలిలేని మెంట‌ల్ కొడుకులను కొనేసిన కావ్య పాప‌..ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు న‌ర‌క‌మే !
Advertisement

SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇప్పటి నుంచే బీసీసీఐ అన్ని కసరత్తులు మొదలుపెట్టింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ నవంబర్ 15వ తేదీన ముగిసింది. డిసెంబర్ మాసంలో మినీ వేలం కూడా జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( Sunrisers Hyderabad) సంబంధించిన బ్యాటింగ్ లైనప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేకేఆర్ డేంజర్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ( Andre Russell) సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి రాబోతున్నట్లు ఓ పోస్టు వైరల్ అవుతోంది. నిజంగానే స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ జట్టులోకి ఆండ్రీ రస్సెల్ వెళ్తే ప్రత్యర్థులకు నరకమే అంటూ పోస్టులు పెడుతున్నారు SRH అభిమానులు.

Also Read: IND VS SA 2nd Test: టీమిండియా జెర్సీపై ట్రోలింగ్..న‌ర్స్ పాప‌ల్లాగే ఉన్నారురా..మెడ‌ప‌ట్టితో గిల్ ద‌ర్శ‌నం

భయంకరంగా మారిన SRH బ్యాటింగ్ లైనప్

Advertisement

ఐపీఎల్ హిస్టరీలో అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ జట్టుదే. ఇప్పటికే చాలా సార్లు ఇది రుజువు అయింది. అయితే అలాంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి కేకేఆర్ డేంజర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కూడా వస్తే ప్ర‌త్య‌ర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం గ్యారంటీ. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆండ్రీ రస్సెల్ ను ఎలాగైనా కొనుగోలు చేసేందుకు స్కెచ్ లు వేస్తున్నారట హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు అతని కొనుగోలు చేసి తీరుతానని శపథం చేశారట కావ్య పాప‌. ఆండ్రీ రస్సెల్ హైదరాబాద్ జట్టులోకి వస్తే, ఆల్రౌండర్ గా బాగా పనికి వస్తాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా ఇరగదీస్తాడు. అంతేకాదు ఆండ్రీ రస్సెల్ హైదరాబాద్ జట్టులోకి వస్తే, 300 కాదు 400 కూడా కొట్టడం గ్యారంటీ అని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.

300 కాదు 400 కొట్ట‌డం ప‌క్కా

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఆండ్రీ రస్సెల్ ( Andre Russell) వస్తే, భారీ స్కోర్ రావడం మాత్రం పక్కా. ఓపెనర్లుగా ట్రావీస్‌ హెడ్ తో పాటు అభిషేక్ శర్మ దుమ్ములేపుతారు. వాళ్ళిద్దరూ 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే స్కోర్ 200 దాటిస్తుంది. ఆ తర్వాత ఇశాన్ కిషన్ వీడు అందరికన్నా మెంటలోడు. 300 స్ట్రైక్ రేటుతో ఇర‌గదీస్తాడు. ఆ తర్వాత కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వచ్చాడంటే స్పిన్నర్లకు సుస్సు పోయించడం గ్యారంటీ. ఇక చివరలో ఆండ్రీ రస్సెల్ ( Andre Russell) యాడ్ అయితే, బౌలర్లకు నరకం కనిపించడం గ్యారంటీ అంటున్నారు. వీళ్ళందరూ ఒక్క మ్యాచ్ లో అయినా రాణిస్తే 300 కాదు 400 కొట్టడం మాత్రం పక్కా అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.  కాగా ఐపీఎల్ మినీ వేలం డిసెంబ‌ర్ 16న అబుదాబీలో జ‌రుగ‌నుండ‌గా, మార్చి 15 – 2026 లో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది.

Advertisement

Also Read: Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×