E-Paper
Advertisement

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు
Advertisement

November 2025 OTT releases : 2025 నవంబర్ నెల ఆడియన్స్ కి ఓటీటీ సంస్థలు బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, హాట్‌ స్టార్ వంటి ప్లాట్‌ ఫామ్‌లు ఒక్కోటీ సూపర్ హిట్ సిరీస్‌లను రిలీజ్ చేస్తున్నాయి. మనోజ్ బాజ్‌పేయి ‘ఫ్యామిలీ మ్యాన్ 3’తో స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టబోతుండగా, హాలీవుడ్ సూపర్ హిట్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ ఫైనల్ సీజన్‌తో అందరినీ అలరించబోతోంది. హుమా ఖురేషీ ‘మహారాణి సీజన్ 4’ పాలిటికల్ డ్రామాతో మళ్లీ రాణి భారతీగా మెరిసిపోతోంది. షెఫాలీ షా ‘డెల్హీ క్రైమ్ 3’తో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుండగా, ఇంకా చాలా సిరీస్‌లు ఆడియన్స్ కి చిల్లింగ్ థ్రిల్ ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే. వీకెండ్ ప్లాన్ రెడీ గా ఉండండి.

‘మహారాణి సీజన్ 4’  (Maharani Season 4)

హుమా ఖురేషీ నటించిన ఈ పాలిటికల్ డ్రామా సిరీస్ నాల్గవ సీజన్‌తో మళ్లీ వస్తోంది. ఇందులో రాణి భారతీ బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్లి ఒక పెద్ద రాజకీయ యుద్ధం చేస్తుంది. అమిత్ సియాల్, వినీత్ కుమార్, ప్రమోద్ పాఠక్ లాంటి స్టార్ కాస్ట్‌తో ఈ సీజన్ మరింత ఇంటెన్స్‌గా ఉంటుంది. పవర్, కుట్రలు, రివెంజ్ లతో ఈ సిరీస్ చూపు తిప్పుకోనీకుండా చేస్తుంది. ఇది SonyLIV లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

‘డెల్హీ క్రైమ్ సీజన్ 3’ (Delhi Crime Season 3)

Advertisement

ఎమ్మీ అవార్డును గెలిచిన ఈ సిరీస్, మూడో సీజన్‌తో మళ్ళీ ఓటీటీని షేక్ చేయబోతోంది. షెఫాలీ షా DCP వర్తికా రోల్‌లో మళ్లీ కనిపిస్తుంది. ఈసారి హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదిస్తుంది. హుమా ఖురేషీ కొత్తగా జాయిన్ అయింది. రియల్ క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి ఇది మస్ట్ వాచ్ సిరీస్. ఈ సిరీస్ Netflix లో నవంబర్ 13 నుంచి అందుబాటులో ఉంటుంది.

‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ (The Family Man Season 3)

మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ తివారీగా మళ్లీ వచ్చేశాడు. ఇండియా-చైనా టెన్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ లో జైదీప్ అహ్లావత్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో ఈ సీజన్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. Amazon Prime Videoలో నవంబర్ 21న ఈ డ్రామా రాబోతోంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 (Stranger Things Season 5)

Advertisement

ఈ సిరీస్ లో రాబోతున్న ఆఖరి సీజన్ఫై. ఎల్విన్, మైక్ బృందం ఒక పెద్ద యుద్దంలో పాల్గొంటారు. మొదటి 4 ఎపిసోడ్స్ నవంబర్ 26న, తర్వాత వాల్యూమ్ 2 డిసెంబర్ 25న రిలీజ్ అవుతాయి. ఇక ఫైనల్ ఎపిసోడ్ జనవరి 1న హాలీవుడ్ ఫ్యాన్స్‌కి బిగ్గెస్ట్ ట్రీట్ గా ఉండబోతోంది.
ఈ సిరీస్ నవంబర్ 26 నుంచి Netflixలో ప్రసారం కాబోతోంది. వీటితో పాటు ‘బరముల్లా’ (Netflix – నవంబర్ 7), ‘ఫ్రాంకెన్‌స్టీన్’ (Netflix – నవంబర్ 7)తో నవంబర్ మొత్తం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ జోరు మీద ఉంటాయి.

Read Also : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×