మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు ఆయనకు రెండు పెళ్లిళ్లు అని, ఇద్దరు భార్యలున్నారనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన మరణం తర్వాత ఉప ఎన్నికల సందర్భంగా ఆ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మాగంటి సునీత ఆయన రెండో భార్యగా తెలుస్తోంది. అయితే మొదటి భార్యను బీఆర్ఎస్ ఎందుకు గుర్తించలేదు, మొదటి భార్య సంతానాన్ని బీఆర్ఎస్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదనేదే ఇక్కడ ఆశ్చర్యకరం. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన రెండో భార్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. పోనీ రెండో భార్యే అసలైన వారసురాలు అని ఫ్యామిలీ అంతా తీర్మానించిందా అంటే అదీ లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆ ఫ్యామిలీ పరువుని రచ్చకీడ్చినట్టయింది.
అసలు వారసులం మేమే..
ఇటీవల మాగంటి గోపీనాథ్ కన్నకొడుకుని నేనేనంటూ ప్రద్యుమ్న తారక్ అనే యువకుడు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాగంటి గోపీనాథ్ భార్య అంటూ సునీత అనే మహిళ అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిందని, ఆమె నామినేషన్ రద్దు చేయాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ప్రద్యుమ్న తారక్ తల్లి, అంటే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కూడా తెరపైకి వచ్చారు. ఆమె పేరు మాగంటి మాలిని దేవి. తమకు ఆస్తులేమీ వద్దని, అసలు తమని కాకుండా ఇంకో మహిళను మాగంటి గోపీనాథ్ భార్యగా గుర్తించడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విడాకులయ్యాయా?
పోనీ మాగంటి గోపీనాథ్ కి మొదటి భార్యతో విడాకులయ్యాయా అంటే అదీ లేదు. అలాంటప్పుడు రెండో భార్యకి బీఆర్ఎస్ ఎందుకు ప్రయారిటీ ఇచ్చిందనేదే ఇక్కడ అసలు ప్రశ్న. పోనీ మొదటి భార్య మాగంటి కుటుంబంతో సంబంధం తెంచేసుకుందా అంటే దానికి సమాధానం లేదు. మొదటి భార్యని, ఆమె కుమారుడిని కూడా మాగంటి గోపీనాథ్ దగ్గరకు రానిచ్చేవారు కాదని, ఆయన మరణం సమయంలో కూడా వారిని దూరం పెట్టారని తెలుస్తోంది.
తల్లి ఆవేదన..
చివరిగా మాగంటి గోపీనాథ్ తల్లి కూడా ఈ విషయంపై కేటీఆర్ ని నిలదీస్తూ మీడియాతో మాట్లాడటం విశేషం. గోపీనాథ్ వెంటిలేటర్ పై ఉన్న సమయంలో తనని కూడా దూరం పెట్టారని, తల్లిగా తన కొడుకుని చూసే అవకాశం తనకు ఇవ్వలేదన్నారామె. అసలు గోపీనాథ్ మరణమే ఓ మిస్టరీ అన్నారు. దానికి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. దీంతో కేటీఆర్ ఇరుకున పడ్డారు.
మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు
నా కొడుకు బ్రతికినన్ని రోజులు చాలా హుందాగా బతికాడు. మాగంటి గోపీనాథ్ చావే ఒక మిస్టరీ. నా కొడుకు చావుకు కారణం కేటీఆర్.#KTR #MagantiGopinath #BRS #Telangana @GeethaAinala @Revanth_Sainyam @REVANTHANNATG @IndianARmyIndi9 @INC_Ramavath pic.twitter.com/IENP9tLZ0Q
— Telugu Stride (@TeluguStride) November 6, 2025
Also Read:మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?
బీఆర్ఎస్ కి భారీ షాక్..
ఎన్నికలకు ఇంకా 5 రోజులే సమయం ఉంది. ఈ టైమ్ లో మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ గొడవలు బయటకు రావడం బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ మాగంటి సునీత, గోపీనాథ్ భార్య అని మాత్రం చెబుతూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు. కనీసం మొదటి భార్య ప్రస్తావన కూడా చేయలేదు. కొడుకు రచ్చ కెక్కినా, ప్రచారంలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు కేటీఆర్. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తల్లి నేరుగా కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు. కనీసం వీటికయినా ఆయన సమాధానం చెబుతారేమో చూడాలి. మాగంటి ఫ్యామిలీ గొడవలు బీఆర్ఎస్ ఓటమిని ఖాయం చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
Also Read: నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి